
2024 ఎన్నికలలో 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ, పాతికేళ్ల రాజకీయ భవిష్యత్ అన్న జనసేన రెండు పార్టీలు కూడా ఏపీలో అత్యంత బలహీనమైన బీజేపీ తో పొత్తుకు సిద్దమైన తరుణంలో నాడు టీడీపీ, జనసేన పార్టీల మీద ఇంట, బయట కూడా విమర్శల మోత మోగింది.
బాబు కేసుల నుంచి తప్పించుకోవడానికే టీడీపీ, బీజేపీ తో పొత్తు పెట్టుకుంది అంటూ ప్రత్యర్థి వర్గం, అసలు బీజేపీ తో పొత్తు అవసరం ఏముంది.? ఏపీలో బలమే లేని బీజేపీ కోసం టీడీపీ త్యాగాలు చెయ్యాలా.? అంటూ సొంత వర్గం ఇలా బాబు పై తీవ్ర రాజకీయ ఒత్తిడి తెచ్చారు. అయినా బాబు ఎక్కడ విమర్శలకు తడబడలేదు, వెనుకాడలేదు బీజేపీ తో స్నేహ హస్తానికి ముందుకొచ్చారు.
Also Read – రెట్రో (Retro) ట్రైలర్ – ఆ స్థాయి కొత్తదనాన్ని చూపించడంలో విఫలం.
అలాగే ఇటు జనసేన విషయంలో కూడా పొత్తులో భాగంగా వచ్చిన 23 సీట్లలో కూడా తిరిగి 2 సీట్లు బీజేపీ కోసం పవన్ త్యాగం చేయడాన్ని జనసేన మద్దతుదారులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా పవన్ ఎక్కడ కుంగిపోలేదు, కూటమి పొత్తుతో బీజేపీ భుజం కాసారు. అయితే ఇదంతా బాబు, పవన్ ఎందుకు చేస్తున్నారు అన్న ఒక్కో ప్రశ్న కు నేడు సమాధానం దొరుకుతుంది.
ఏపీలో బలం లేని బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉంది, ఏపీ ఇతర రాష్ట్రాలతో సమానంగా నిలబడాలి అంటే కేంద్ర సాయమే ఏపీకి బలంగా మారుతుంది. ఆ బలాన్ని రాష్ట్ర అభివృద్ధికి కేటాయించి ఏపీ పునర్నిర్మాణానికి బాటలు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగానే బాబు, పవన్ లు బీజేపీ తో పొత్తు కోరుకున్నారు, ఇప్పుడు వాటి ఫలితాలను రాష్ట్రానికి అందిస్తున్నారు.
Also Read – స్మితా సభర్వాల్: ఈమెను ఎలా డీల్ చేయాలబ్బా!
గత ఐదేళ్ళు వైసీపీ నిరంకుశత్వంతో పాడుబడిన అమరావతి పునర్నిర్మాణం, ఆగిన పోలవరం, అటకెక్కిన అభివృద్ధి, క్షిణించిన ఆర్థిక వ్యవస్థ ఇలా ప్రతి అంశంలోనూ వైసీపీ విధ్వంశమే సృష్టించింది. వీటన్నిటిని చక్కదిద్దుకుంటూ తిరిగి రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యతను చేపట్టిన బాబు, పవన్ లు ఆదిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వమైనా ఎన్డీయే లో భాగమయ్యి రాష్ట్రానికి కావాల్సిన నిధులను సమకూర్చుకుంటున్నారు.
ఇందులో భాగంగానే కేంద్ర సాయంతో అమరావతి పనులు ఊపందుకున్నాయి, అటు పోలవరం కూడా కూటమి ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేయడానికి అన్ని ప్రణాళికలు చేస్తున్నారు, ఇటు అభివృద్ధి విషయంలోనూ రాజీ లేని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఏపీలో దాదాపు 80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం ముందుకొచ్చింది.
Also Read – జాక్ అండ్ లైలా: రెండు స్పీడ్ బ్రేకర్లే
ఇందుకు గాను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక ప్రకటన జారీ చేసారు. ఏపీ, గుజరాత్, ఒడిస్సా రాష్ట్రాలు పెట్రోలియం రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నాయంటూ పేర్కొన్న కేంద్ర మంత్రి ఏపీలో పెట్టుబడులకు అనుమతులిచ్చారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది.
అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రీన్ ఎనర్జీ విషయంలో కూడా ఏపీకి పెద్ద పీట వేసింది కేంద్ర బీజేపీ. “పీఎం ఈ బస్ సేవా యోజన” పథకం కింద మొదటి దశలో ఏపీకి 750 ఎలక్ట్రికల్ బస్సులను మంజూరు చేసింది. రాష్ట్రంలోని 11 నగరాలలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తుంది ఏపీ ప్రభుత్వం.
అందులో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, మంగళగిరి, కడప నగరాలలో ఈ బస్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఆ ఎలక్ట్రిక్ బస్ సేవలతో టీడీపీ సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
ఇలా నాడు బీజేపీ తో పొత్తు కారణంగా ఇంట బయట విమర్శలు ఎదుర్కున్న బాబు, పవన్ లు నేడు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి వస్తున్న అవకాశాలతో, అభివృద్ధి ఫలాలతో అదే పొత్తు నిర్ణయం పట్ల ప్రసంశలు పొందుతున్నారు.
ఈ పొత్తు పార్టీల కోసమో, వ్యక్తిగత పదవుల కోసమో కాదని ఈ మూడు పార్టీల పొత్తు రాష్ట్ర శ్రేయస్సుకి, ఏపీ ప్రజలు అభివృద్ధికి సంబంధించిందని, ఈ పొత్తు పవన్ చెపుతున్నట్టు, బాబు భావిస్తున్నట్టు ఏపీలో మరో పదిహేనేళ్ళు ప్రభుత్వంలో ఉంటే ఏపీ కూడా అభివృద్ధిలో దూసుకుపోతుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.