సీదిరీ నువ్వు మంత్రివేగా… ఈ ఇళ్ళు పూర్తిచేయగలవా?

Gouthu Sireesha TDPతెలుగుదేశం పార్టీ నేతలందరూ తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిపనులను చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్‌లు విసురుతుంటే, ఈ నాలుగేళ్ళలో సంక్షేమ పధకాలు తప్ప చేసిందేమీలేకపోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు వారికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక తల పట్టుకొంటున్నారు.

ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురించి నోటికివచ్చిన్నట్లు మాట్లాడేసి జగనన్న చేత మొట్టికాయలు వేయించుకొన్న మంత్రి సీదిరి అప్పలరాజు దీనికో పరిష్కారం కనుకొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళలో ఒక భవనానికి వైసీపీ రంగులు వేయించి దాని ముందు సెల్ఫీ దిగి, టిడిపి ప్రభుత్వం కానీ, టిడిపి మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ గానీ శ్రీకాకుళం జిల్లాకి ఇలాంటివెమైనా చేశారా చూపాలంటూ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

ADVERTISEMENT

శ్రీకాకుళం శివంగి అని పేరు తెచ్చుకొన్న గౌతు శివాజీ కుమార్తె గౌతు శిరీష ఈరోజు పలాసలో అవే ఇళ్ళ వద్దకు వెళ్ళి అసలు రహస్యం బయటపెట్టేరు. టిడిపి హయాంలో ఒక్క పలాసాలోనే ఎమ్మెల్యేగా ఉన్న తన తండ్రి గౌతు శివాజీ చొరవ తీసుకొని 2090 ఇళ్ళు నిర్మింపజేశారని, కానీ మంత్రినని గొప్పలు చెప్పుకొంటున్న సీదిరి అప్పలరాజు మిగిలిన ఆ కొద్దిపాటి పనులను కూడా పూర్తిచేయలేక ఇళ్ళను పాడుపెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పైగా వాటిలో పూర్తికాని ఓ భవనానికి వైసీపీ రంగులు వేయించుకొని వాటి ముందు నిలబడి నిసిగ్గుగా సెల్ఫీ తీసుకొని తమను సవాలు చేస్తున్నాడని గౌతు శిరీష ఎద్దేవా చేశారు. ఒక ఎమ్మెల్యే హోదాలో తన తండ్రి పాలసాలో 2090 ఇళ్ళు కట్టిస్తే మంత్రి హోదాలో ఉన్న సీదిరి ఆ ఇళ్ళను పూర్తిచేయించలేకపోవడం సిగ్గుచేటని, పైగా తన తండ్రి కట్టించిన ఇళ్ళ ముందు నిలబడి సెల్ఫీ దిగి మళ్ళీ తనకే సవాలు విసురుతున్నాడని గౌతు శిరీష ఎద్దేవా చేశారు.

ఆనాడు టిడిపి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటివి లక్షల ఇళ్ళు నిర్మించిందని వాటన్నిటినీ వైసీపీ ప్రభుత్వం ఇలాగే పాడుబెట్టిందని గౌతు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తన తండ్రి గౌతు శివాజీ నిర్మింపజేసిన ఆ ఇళ్ళన్నిటినీ సెల్ఫీ తీసి చూపించడంతో, అసంపూర్తిగా ఉన్నవాటి మద్య సీదిరి సెల్ఫీ ఛాలెంజ్ కోసమే వైసీపీ రంగులేసుకొన్న ఆ ఇల్లు కూడా కొట్టవచ్చిన్నట్లు కనబడుతోంది.

ఇలాంటి చవుకబారు ప్రయత్నాలు చేసేబదులు గౌతు శిరీష సూచించిన్నట్లు కనీసం ఆ ఇళ్ళ పనులను పూర్తిచేయించిన తర్వాత వైసీపీ రంగులేసుకొని లబ్దిదారులకు పంచిపెట్టుకొంటే వచ్చే ఎన్నికలలో ఓట్లు పడతాయి కదా?

ADVERTISEMENT
Latest Stories