“ఒళ్ళు దగ్గర పెట్టుకోండి… నేను చెప్తున్నా… తీవ్రమైన పరిణామాలు ఉండబోతున్నాయి… నేను వదిలిపెట్టను మిమ్మల్ని ఎక్కడున్నా… మీరు అనుకోవచ్చు పెద్దాయన వదిలిపెడతాడని, ఆయన చాలా పెద్ద మనసు, నాకైతే ఉండదు… గుర్తు పెట్టుకోండి” అంటూ నారా లోకేష్ తీవ్రస్థాయిలో వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
వరద బాధితులకు పాలు, పెరుగు వంటి నిత్యావసర సరుకులు మా అమ్మ గారు అందజేశారు, ఈ కార్యక్రమానికి దాదాపుగా 50 లక్షల రూపాయలు ఖర్చు చేసారు. అలాగే చనిపోయిన 48 కుటుంబాలకు ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 48 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చారని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమాలు చేస్తున్నపుడు అమ్మ ఎవరిని విమర్శించలేదు, గౌరవం కోరుకునే కుటుంబం మాది, అలాంటిది ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా మా అమ్మను విమర్శిస్తారు. మానవత్వం ఉందా మీకు? మీ ఇంట్లో ఉన్న తల్లి, భార్య, కూతుళ్ళ గురించి ఇట్లానే మాట్లాడతారా? గౌరవ శాసన సభ్యురాలిని, మంత్రులను అడుగుతున్నానని ఆగ్రహించారు.
అసలు మీరు మనుషులేనా? చిత్తశుద్ధితో దాదాపు కోటి రూపాయలు విలువను ప్రజల కోసం ఖర్చు పెట్టారు. మీ నాయకుడు తీత్లీ , హుదుద్ తుఫాన్ లకు 50 లక్షలు ప్రకటించాడు, పైసా ఖర్చు పెట్టలేదు, ఆయన తిరిగిన బండి కూడా ప్రభుత్వ బండిలో తిరిగాడు, తప్పించుకునే బ్యాచ్ మీరు. మంచితనంతో సేవ చేసిన మా అమ్మపై విమర్శలు చేసిన మీరు నిజంగా మనుషులా? పశువులా? అంటూ ఉగ్ర రూపంతో వ్యాఖ్యానించారు.
సిగ్గుండాలి మీకు… వరదలొచ్చినపుడు ఈ 3 జిల్లాలలో మీరేం చేసారు అసలు? శాసన సభ్యురాలిని, మంత్రులను అడుగుతున్నా, మీరేం చేసారని? ఇంట్లో కూర్చుని పేకాట ఆడుకున్నారు మీరు? బ్లాక్ మార్కెట్ లో బియ్యాన్ని అమ్ముకున్నారు మీరు… మీరలా మా తల్లి గురించి మాట్లాడేది అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
లోకేష్ మాట్లాడుతున్న తీరుతో టిడిపి నేతలు మాంచి హుషారులో ఉంటున్నారు. 2014 అధికార పక్షంలో లోకేష్ మాట్లాడిన విధానానికి, ఇపుడు మాట్లాడుతున్న విధానానికి చాలా వ్యత్యాసం కనపడుతోంది. ముఖ్యంగా మునుపెన్నడూ లేని రీతిలో ఆత్మవిశ్వాసం లోకేష్ ప్రస్ఫుటంగా తెలుస్తోంది. గతంలో కూడా ‘మా నాన్నంత మంచోడిని తానైతే కాదని’ గతంలో కూడా లోకేష్ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన వైనం తెలిసిందే.
🔥🔥🔥 pic.twitter.com/GS7HuZBpD7
— anigalla🇮🇳 (@anigalla) December 22, 2021



