ఆంధ్ర రాజకీయాలకు ఇక తెలంగాణాలో చెల్లు

TDP losts its base in telangana, no more andhra politicsతెలంగాణ సమాజం మరోసారి స్వయం పాలనకు పట్టాభిషేకం చేసింది. కేసీఆర్ ముద్దు ఇతరులు మాకు వద్దు అంటూ తేల్చి చెప్పింది. కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితం కాగా, టీడీపీ రెండంటే రెండే సీట్లలో నిలిచింది. కాంగ్రెస్ ఊతంతో తెలంగాణ రాజకీయాలలోకి తిరిగి వద్దాం అనుకున్న చంద్రబాబు వ్యూహం దారుణంగా ఫెయిల్ అయ్యింది. దీనితో తెలంగాణాలో తెలుగుదేశం మనుగడ ప్రశ్నర్ధాకం అయ్యింది. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను ముందుముందు నిలబెట్టుకోవడం కూడా కష్టమే.

ADVERTISEMENT

[m9ad]

ఆంధ్ర ప్రజానీకం ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో కూడా గులాబీ గాలి వీచింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి సెట్లర్లలోని కొన్ని వర్గాలు ఏపీలోని పార్టీ బేధాల బట్టి కేసీఆర్ కు దగ్గరగా జరిగాయి. అదే క్రమంలో మిగతా వారు తెలంగాణ వచ్చాకా కూడా తమకు ఇక్కడ ఇబ్బందేమీ లేదు కదా. వేరే పార్టీలకు వేసి ఇక్కడి సమాజంలో తమను తాము విడిగా చూపించుకోవడం ఎందుకు అనుకుని కారుకే జై కొట్టారు. ఇది నాలుగున్నర ఏళ్ళ తెరాస పాలనకి అత్యంత ప్రతిష్టాత్మక గెలుపు అనే చెప్పుకోవాలి.

ఇప్పటిదాకా చేసినట్టు భవిష్యత్తుల్లో షెట్లర్ల రాజకీయం చెయ్యడం కుదరకపోవచ్చు. తెలుగుదేశం ప్రాభవం తగ్గిపోవడం వైకాపా, జనసేన పార్టీలు తెలంగాణ మీద ఆశలు లేకపోవడంతో ఆ దిశగా ప్రయత్నించేవారు కూడా లేకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ జాతీయ పార్టీనే. కేసీఆర్ రెండో టర్మ్ లో ఆంధ్ర నుండి వచ్చిన ప్రజలను చిన్న చూపు చూస్తే తప్ప ఆంధ్ర రాజకీయాలకు ఇక తెలంగాణాలో చెల్లు. ఇప్పటిదాకా కేసీఆర్ వ్యవహరించిన తీరు చూస్తే మళ్ళీ అలాంటి తప్పు చేస్తారని అనుకోలేము.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో 29 నియోజకవర్గాలలో తెరాస 18 నియోజకవర్గాలలో గెలిచింది. వాటిలో మజ్లీస్ కింద ఉన్న 7 నియోజకవర్గాలను కూడా తీసేస్తే కేవలం నాలుగు స్థానాలలో తెరాస గెలవలేకపోయింది. ఈ రెండు జిల్లాలో టీడీపీకి ఒక్క సీటూ రాకపోవడం గమనార్హం. అదే క్రమంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంటు ఒక్క స్థానం (ఇబ్రహీంపట్నం), కాంగ్రెస్ మూడు స్థానాలతో (ఎల్ బీ నగర్, మహేశ్వరం, తాండూర్) సరిపెట్టుకుంది.

ADVERTISEMENT
Latest Stories