దేశంలో ఏ కార్యకర్తకు లేని ధీమా – తెలుగు దేశం కార్యకర్తకే

TDP Membership Benefitsతెలుగుదేశంలో నారా లోకేష్ క్రియాశీలంగా మారిన కొత్తలో ఆయనకు వచ్చిన ఒక ఐడియా ఆ పార్టీలో ఒక కొత్త విప్లవాత్మకమైన భీమా మొదలయ్యింది. కార్యకర్తలకు బీమా సదుపాయం దేశంలో మరే రాజకీయ పార్టీ చేయని వినూత్న కార్యక్రమం తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే ఉన్న ధీమా. 2015 జనవరి నుంచి అమల్లోకి తెచ్చారు.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో పార్టీకి సుమారు 70 లక్షల మంది సభ్యులున్నారు. వారందరినీ బీమా పరిధిలోకి తీసుకురావడం విశేషం. రూ.100 సభ్యత్వ రుసుం చెల్లించి సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీ ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తోంది. వారి తరఫున పార్టీనే ప్రీమియం చెల్లిస్తోంది.

ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోను 1971 కుటుంబాలకు చేయూత లభించింది. రూ.39.42 కోట్ల పరిహారం అందింది. ఆంధ్రప్రదేశ్ లో 1673 కుటుంబాలు, తెలంగాణాలో 298 కుటుంబాలను ఈ పధకం ఆదుకుంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఆసరాగా నిలిచింది.

పార్టీలో ఇది వరకు సాధారణ, క్రియాశీల సభ్యత్వాలు ఉండేవి. ఇటీవల ఒకే సభ్యత్వ విధానం ప్రవేశపెట్టారు. రెండేళ్లకొకసారి సభ్యత్వాల పునరుద్ధరణ, కొత్త సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఉంటుంది. తెలుగుదేశాన్ని చూసి చాల రాజకీయ పార్టీలు ఇదే కార్యక్రమం చేపట్టిన అవి అమలు నోచుకోలేదు. దీని వల్లే ఏమో తెలుగు దేశం కార్యకర్తల పార్టీ అంటారు.

ADVERTISEMENT
Latest Stories