వైసీపీ కి గట్టి కౌంటర్ “అంతిమ యాత్ర”.!

TDP YCP

నేటి కాలంలో రాజకీయ పార్టీల గెలుపోటములను నిర్ణయించే స్థాయికి సోషల్ మీడియా విస్తరించింది అంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి. మొన్నటి వైసీపీ గెలుపులో కానీ నేటి తెలంగాణ లో కాంగ్రెస్ విజయంలో కానీ సోషల్ మీడియా ప్రచారం ప్రముఖ పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు.

2024 ఏపీలో జరగబోయే ఎన్నికలలో కూడా ప్రముఖ పార్టీలు అన్ని సోషల్ మీడియా పై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాయి.ఆయా పార్టీల ప్రచారానికే కాదు ప్రత్యర్థుల మీద కౌంటర్లకు కూడా సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నాయి రాజకీయ పార్టీలు. అందునా టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీ ప్రచారాలతో , కౌంటర్లతో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ తమ పార్టీ గెలుపుకి నిరంతర సేవలందిస్తున్నాయి.

ADVERTISEMENT

అయితే తాజాగా వైసీపీ పార్టీ విజయావకాశాలను పెంచుకోవడానికి సినిమాలను నమ్ముకుని యాత్ర.2 ని సిద్ధంచేస్తున్నారు వైసీపీ వర్గీయులు. 2019 ఎన్నికల ముందు యాత్ర.1 తో ప్రజల ముందుకొచ్చిన వైసీపీ వైస్సార్ సింపతిని మరోసారి తన పార్టీ రాజకీయ అవసరాలకు వాడుకుంది.అయితే ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనుండడంతో మళ్ళీ అదే ఫార్ములాను ప్రయోగిస్తోంది వైసీపీ. కానీ ఈసారి టీడీపీ వైసీపీ పార్టీకి కౌంటర్ ఎటాక్ చేయడానికి పెద్ద సమయం తీసుకోలేదు.

టీడీపీ సోషల్ మీడియాలో “అంతిమ యాత్ర” అంటూ టైటిల్ పెట్టి జగన్, ఆయన బాబాయ్ వివేకా పోస్టర్ తో ఒక పోస్ట్ విడుదల చేశారు. “నేనెవరో ఈ ప్రపంచానికి బాగా తెలుసు. గత ఎన్నికలప్పుడు బాబాయ్ కి అంతిమ యాత్ర ప్లాన్ చేసి అధికారంలోకి వచ్చాను. అందుకే వచ్చే ఎన్నికలు నా పాలనకు అంతిమయాత్ర కాబోతున్నాయి”…అంటూ అంతిమ యాత్ర పాదముద్ర వేసి దాని కింద అవినాష్ రెడ్డి, గంగి రెడ్డి పేర్లు జోడించారు. ఈ పోస్టర్ చూసిన వారంతా వైసీపీ కి జగన్ కు టీడీపీ గట్టి కౌంటర్ వేసింది అంటూ లైకులు, షేర్లతో X లో ట్రెండ్ చేస్తున్నారు.

టీడీపీ ఒక్క పోస్టర్ తోనే అటు వైసీపీ పార్టీకి, ఇటు ముఖ్యమంత్రి జగన్ కు, వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డి, గంగి రెడ్డిలతో పాటు యాత్ర సినిమాకు కూడా గట్టి కౌంటర్ వేసినట్లయ్యింది. “యాత్ర.2 “తో జగన్ తన పాదయాత్రను, తన తండ్రి మరణ వార్తను ప్రజలకు మరోసారి గుర్తుచేయాలని చూస్తే దానికి “అంతిమయాత్ర” పేరుతో వివేకా మరణ వార్తను, వైసీపీ హత్య రాజకీయాలను గుర్తుచేస్తూ టీడీపీ వైసీపీ పై పైచేయి సాధించినట్లయ్యింది.

ADVERTISEMENT
Latest Stories