అక్కడ బాంబులతో… ఇక్కడ రాజకీయ యుద్ధాలు… ఫలితం ఒకటే

TDP_and_YSRCPఇంటి పెద్ద సరైనవాడు కాకపోతే ఆ కుటుంబానికి కష్టాలు తప్పవు. రాష్ట్ర ముఖ్యమంత్రి సరైనవాడు కాకపోతే ఆ రాష్ట్ర ప్రజలందరూ కష్టానష్టాలను భరించాల్సి ఉంటుంది. అదే ఓ దేశాధినేత సరైనవాడు కాకపోతే యావత్ ప్రపంచం మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

ఇందుకు రష్యా, చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా వంటి దేశాల పాలకులు, వారి వలన నష్టపోతున్న దేశాలు కళ్ళముందే ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో పాలస్తీనా చేరింది. ఇజ్రాయెల్-పాలస్తీనాల మద్య భారత్‌-పాక్ కంటే సుదీర్గమైన శతృత్వం ఉంది. దాని గురించి ఇప్పుడు చర్చించలేము. కానీ పాలస్తీనాలో హమాస్ అనే ఓ మిలిటెంట్ సంస్థ దుందుడుకుతనం వలన ఇప్పుడు ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మద్య భీకర యుద్దం జరుగుతోంది. దానిలో ఇరుదేశాలకు చెందిన అమాయక ప్రజలు బలైపోతున్నారు. పెను విధ్వంసం జరుగుతోంది.

ADVERTISEMENT

రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల గొడవలు మనకెందుకు?అని అనుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్ళుగా టిడిపి-వైసీపిల మద్య ఇటువంటి యుద్ధవాతావరణమే నెలకొంది. వాటిలో ఇజ్రాయెల్ ఏది? పాలస్తీనా ఏది? అని ఎవరికి వారు ఆలోచించుకోవలసిందే.

ఆ రెండు దేశాలలాగే ఏపీలో రెండు పార్టీలు కూడా రెండు పూర్తివిభిన్నమైన బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేయడం సహజమే. వాటిని పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టి పనిచేస్తే ఏ రాష్ట్రమైనా తెలంగాణ రాష్ట్రంలా అభివృద్ధి చెందుతుంది.

కానీ ఏపీలో వైసీపి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై కంటే టిడిపిపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఒకవేళ రాష్ట్రంలో టిడిపి లేకపోయుంటే వైసీపి ప్రభుత్వం కూడా బహుశః అభివృద్ధిపై దృష్టి పెట్టి ఉండేదేమో?కానీ టిడిపి ఉంది. బలంగా కూడా ఉంది.

కనుక టిడిపితో వైసీపి మనుగడకు ప్రమాదం ఉందని భావిస్తున్నందునే కనుక దానిని సమూలంగా తుడిచిపెట్టేసేందుకు వైసీపి విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆ భయంతోనే గత నాలుగున్నరేళ్ళుగా 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

వైసీపి ఎంచుకొన్న ఈ పంధా వలన ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాలలో వెనకబడిపోయింది. వైసీపి అసమర్ధత, వైఫల్యాలకు, తప్పుడు నిర్ణయాలకు రాష్ట్ర ప్రజలందరూ ఏదో ఓ రూపంలో మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు.

ఇజ్రాయెల్-పాలస్తీనాలు పరస్పరం బాంబులు కురిపించుకొంటుంటే మద్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నట్లే ఇక్కడ ఏపీలో రాజకీయ కక్షలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజలు నలిగిపోతున్నారు. ఇంతే తేడా.

ADVERTISEMENT
Latest Stories