ఇండియా పాకిస్తాన్ ప్రపంచ కప్ లో తలపడిన ఆరు సార్లూ ఏమైంది?

Team Indiam Vs Pakistan - World Cup 2019ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా మీద సునాయాస విజయంతో బోణీ చేసింది టీం ఇండియా. తన తదుపరి మ్యాచ్ లో మన టీంఆదివారం ఆస్ట్రేలియాతో తలపడబోతుంది. ఆ తరువాత జూన్‌ 16న అందరూ వేచి చూసే ఇండియా, పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇరు జట్ల మధ్య జరగబోయే ఏడో ప్రపంచకప్‌ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచ కప్ ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఆరు మ్యాచ్లలోనూ టీమిండియా గెలవడమే ఇందుకు కారణం.

మొట్ట మొదటి సారిగా 1996 ప్రపంచకప్‌లో తలపడ్డాయి రెండు జట్లు. ఈ మ్యాచ్ లో టీమిండియా 39 పరుగులతో విజయం సాధించింది. ఆ తరువాత 1999 ప్రపంచకప్‌లో 47 పరుగులతో జయకేతనం ఎగురవేసింది మన జట్టు. 2003 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ వీరోచిత బాటింగ్ తో టీమిండియా 6 వికెట్లతో విజయం సాధించింది. భారత్ గెలుచుకున్న 2011 ప్రపంచకప్‌లో ఇరు జట్లూ సెమీఫైనల్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో భారత్ 29 పరుగులతో గెలుపు ముంగిట నిలబడి ఫైనల్ కు చేరింది.

ADVERTISEMENT

చివరిగా జరిగిన 2015 ప్రపంచకప్‌ లో భారత్ కప్పు అందుకోలేకపోయినా పాకిస్తాన్ పై 76 పరుగులతో భారీ విజయం చేసింది మన జట్టు. దీనితో కోహ్లీ సేన మరో సారి దాయిదులతో పోరు ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది. 2019లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్‌కోహ్లీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవ్వడం విశేషం. ఓల్డ్ ట్రాఫ్ర్డ్ లో జరిగే ఈ మ్యాచ్ టిక్కెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలే కాకుండా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది అనడం అతిశయోక్తి కాదు.

ADVERTISEMENT
Latest Stories