‘నమస్కారం’ పై ‘సంస్కారం’ లేని విమర్శలా?

Telangana CM Revanth Reddy Meets Former CM KCR At Hospital

రాజకీయాలు అనేది రెండు పార్టీల మధ్యనే కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండకూడదనే అనే
ప్రాథమిక రాజకీయ సూత్రాన్ని పాటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాలుకి జరిగిన శస్త్ర చికిత్స కు కేసీఆర్ ను పరామర్శించడానికి యశోద హాస్పిటల్ కు వెళ్లిన విషయంలో అందరు రేవంత్ చేసిన పనిని అభినందించారు.

అయితే “బాగున్నావా..”అనే పదంలో కూడా బూతులు వెతికే రాజకీయ నాయకులు ఉంటారు అనేలా పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యలు ఉదహరిస్తున్నాయి.కేసీఆర్ ను కలిసిన సందర్భంలో రేవంత్ కేసీఆర్ కు నమస్కారం తెలిపిన ఫోటోను తన వాట్స్ అప్ స్టేటస్ గా పెట్టిన పొన్నాల “నన్ను కనీసం ఒకఏడాదైనా సీఎంగా ఉండనివ్వండి కేసీఆర్ గారు అంటూ రేవంత్ వేడుకుంటున్నట్టు” క్యాప్షన్ ఇచ్చారు.

ADVERTISEMENT

వయస్సులోను, అనుభవంలోనూ తనకంటే పెద్దవాడు, అనుభవజ్ఞుడు అయినా కేసీఆర్ కు రేవంత్ మర్యాద పూర్వకంగా పెట్టిన నమస్కారాన్ని కూడా సంస్కారం లేకుండా రాజకీయ విమర్శలకు వాడుకుంటారా? అంటూ సోషల్ మీడియాలో పొన్నాలను ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఎదుటి మనిషికి నమస్కారం చేయడం ఇటు రాజకీయాలలోనే కాదు అటు భారతీయ సంస్కృతిలో కూడా భాగమే అన్న విషయం పొన్నాల మరిచినట్టున్నారు. ఇటువంటి రాజకీయ వాతావరణం లేక మరో తెలుగు రాష్ట్రం అల్లాడుతుంటే ఇప్పుడు ఇటువంటి విమర్శలు చేసి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం అన్యాయమైన చర్యగా భావిస్తున్నారు టి. కాంగ్రెస్ నేతలు.

గత పదేళ్లనుండి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బిఆర్ఎస్ పార్టీలో చేరిన పొన్నాల పార్టీ మారిన తన తల రాత మార్చుకోలేకపోయారు. ఇప్పుడు పొన్నాల స్థానం మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితమవడంతో ఇక ఆ ప్రస్టేషన్ ఇలా తీర్చుకుంటున్నట్టు ఉన్నారు.అయితే ఈ విమర్శలు చూసిన వారు మాత్రం “మానవత్వం పై కూడా రాజకీయ విమర్శలేనా”? అంటూ పొన్నాల పై మండిపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories