టీడీపీ, జనసేన పార్టీలను రాజకీయంగా దెబ్బకొట్టడానికి, చంద్రబాబు,లోకేష్, పవన్ కళ్యాణ్ ను కించపరుస్తూ సినిమాలు తెరకెక్కించి ఎన్నికల ముందు థియేటర్లలోకి తీసుకువచ్చి ఓటర్లను ప్రభావితం చేయాలనీ చూసిన వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ ఈసారి ఫలించేలా కనపడడం లేదు.
సినిమా ఫినిష్ అయ్యి సెన్సార్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైన తరుణంలో అనూహ్యంగా ఎవ్వరి వ్యూహానికి అందకుండా టీడీపీ నేత నారా లోకేష్ సినిమా విడుదలను అడ్డుకున్నారు. సినిమా తెరకెక్కించిన విధానం పై, సినిమాలో తమను, తమ పార్టీని కించపరిచేలా రూపొందించిన సన్నివేశాలను సాక్షిగా చూపిస్తూ సినిమా విడుదల పై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నారా లోకేష్.
చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా రాంగోపాల్ వర్మ సినిమాను తెరకెక్కించారని, అందులోని పాత్రలు, సన్నివేశాలు తమను అగౌరవ పరిచేలా ఉన్నాయంటూ దీని వలన రాష్ట్రంలో చాలామంది ప్రభావితం అయ్యే అవకాశం ఉందంటూ తమ వాదనలు వినిపించిన లోకేష్ సినిమా సెన్సార్ ను రద్దు చేయాలనీ కోరారు.
దీనితో వ్యూహం సినిమా కు ఇచ్చిన సెన్సార్ ను పునః పరిశీలించాలంటూ.., అప్పటి వరకు ఈ సినిమా విడుదలకు బ్రేకులు వేయాలంటూ తెలంగాణ హై కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీనితో ఇప్పటి వరకు విడుదల తేదీలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణ హై కోర్ట్ సినిమా విడుదలను మరో మూడు వరాల పాటు ఆపాలంటూ చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చింది.
మూడు వారాలలోపు మళ్ళీ రివ్యూ చేసి రిపోర్ట్ అందించాలని, అప్పటి వరకు వ్యూహాన్ని మరోసారి వాయిదా వెయ్యాల్సిందే అని తెలంగాణ హై కోర్ట్ ప్రకటించింది. దీనితో ఈసారి కూడా గత ఎన్నికల మాదిరే లక్ష్మీస్ ఎన్టీఆర్ తో టీడీపీ ని దెబ్బ కొట్టి వైసీపీ కి తనవంతు సాయం అందించాలని చేసిన ఆర్జీవీ వ్యూహాలు ఫలించలేదు.
చిత్ర పరిశ్రమ పై సీతకన్నేసిన వైసీపీ ప్రభుత్వం తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అదే చిత్ర పరిశ్రమ పై ఆధారపడి రాంగోపాల్ వర్మ ను, మరికొందరిని అడ్డుగా పెట్టుకుని వ్యూహం…యాత్ర అంటూ చేస్తున్న ప్రయత్నాలను ఏమనాలో…?




