హైవేలు వద్దు… మందే ముద్దు… కేసీఆర్ సర్కార్..!

Jump Jilanis Headache to KCRజూలై 1వ తేదీ నుండి జాతీయ రహదారుల పక్కన వైన్ షాపులు ఉండరాదనే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, కేసీఆర్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యంపై వచ్చే ఆదాయం కోసం జాతీయ రహదారులనే వదులుకుంది. మద్యం షాపులను కొనసాగించే క్రమంలో… హైదరాబాద్ గుండా వెళుతున్న మూడు జాతీయ రహదారులను టీఆర్ఎస్ ప్రభుత్వం డీనోటిఫై చేసింది. తెలంగాణ ప్రభుత్వ కోరిక మేరకు మొత్తం 55 కిలోమీటర్ల నేషనల్ హైవేను డీనోటిఫై చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది.

ఎల్బీ నగర్ నుంచి అసెంబ్లీ వరకు ఉన్న 14 కిలోమీటర్ల రోడ్డు, అసెంబ్లీ నుంచి మియాపూర్ వరకు ఉన్న 19 కిలోమీటర్ల రోడ్డు, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న 22 కిలోమీటర్ల రోడ్డును డీనోటిఫై చేశారు. దీంతో పాటు హయత్ నగర్ నుంచి పటాన్ చెరు వరకు, ఉప్పల్ నుంచి శంషాబాద్ వరకు ఉన్న రోడ్డును డీనోటిఫై చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ADVERTISEMENT

తెలంగాణ ప్రభుత్వం డీనోటిఫై చేసిన మార్గాల్లో 5 ఫైవ్ స్టార్ హోటళ్లు, 3 ప్రముఖ క్లబ్ లు, వందకు పైగా వైన్ షాపులు, బార్లు ఉన్నాయి. మరోవైపు జాతీయ రహదారులను డీనోటిఫై చేయడంతో… కేంద్రం జాతీయ రహదారులపై పలు నిర్మాణాల కోసం కేటాయించిన 335 కోట్ల నిధులు తిరిగి కేసీఆర్ ప్రభుత్వం నుండి కేంద్రానికి వెనక్కి వెళ్లనున్నాయి. కేవలం మద్యంపై వచ్చే ఆదాయం కోసం హైవేలను వదులుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories