Telangana Minister Harish Rao Sensational comments on Jagan governmentఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య మళ్ళీ మరోసారి యుద్ధం ప్రారంభం అయ్యింది. ఈసారి తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఈ యుద్ధాన్ని ప్రాంభించారు. సిద్ధిపేట జిల్లాలో జరిగిన భారత్‌ వజ్రోత్సవ వేడుకలో ఆయన స్థానిక ఉపాధ్యాయులను తమ ప్రభుత్వం చాలా బాగా చూసుకొంటోందని చెప్పేందుకు ఏపీలో ఉపాధ్యాయుల గురించి మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులను చాలా గౌరవంగా చూసుకొంటోందని కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం ఉద్యోగులను, ఉపాధ్యాయులను వేదిస్తోందన్నారు. ఉపాధ్యాయులు ‘ఛలో విజయవాడ’ ర్యాలీ నిర్వహించాలనుకొంటే వారిపై అక్రమ కేసులు బనాయించి, పోలీస్ స్టేషన్లలో నిర్బందించిందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తుండటం నిజం కాదో తెలుసుకోవాలనుకొంటే అక్కడ మీ స్నేహితులతో మాట్లాడి తెలుసుకోవచ్చని అన్నారు.

Also Read – కేసీఆర్‌, చంద్రబాబుకి తేడా ఇదేగా!

ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు నెలనెలా జీతాలు కూడా సకాలంలో చెల్లించడంలేదని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువే చెల్లిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం గత ఐదేళ్ళలో ఉద్యోగులకు 73 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన సంగతిని మంత్రి హరీష్‌ రావు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు గుర్తు చేశారు.

ఏపీ ప్రభుత్వం అప్పుల కోసమని మోటర్లకు మీటర్లు బిగించేందుకు ఒప్పుకొని ఏడాదికి రూ.6,000 కోట్లు అప్పులు తెచ్చుకొంటోందని కానీ కేసీఆర్‌ మాత్రం రైతులకు నష్టం కలగకూడదని అందుకు అంగీకరించడం లేదని మంత్రి హరీష్‌ రావు అన్నారు. అందుకే రాష్ట్రానికి రావలసిన రూ.30 వేల కోట్లు రాకుండా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు.

Also Read – ఇంతకీ షర్మిల బాణం గురి ఎవరివైపు?