తెలంగాణా చరిత్రలో అరుదైన ఘటన!

kcr-telangana-districts-3పవిత్రమైన విజయదశమి రోజున సరికొత్త తెలంగాణ ఆవిష్కృతం కాబోతోంది. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలకు తోడు మరో 21 కొత్త జిల్లాలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో, కర్కాటక లగ్నంలో కొత్త జిల్లాల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. విజయదశమి ఉదయం 11.13 గంటలకు ధనుర్ లగ్నంలో కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు ప్రారంభిస్తారు. ఎవరెవరు ఏయే జిల్లాలను ప్రారంభించనున్నారో ఓ సారి చూద్దాం.

సిద్ధిపేట – కేసీఆర్ (ఆయన వెంట హరీష్ రావు ఉంటారు)
మెదక్ – డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి
మంచిర్యాల – పద్మారావు
వికారాబాద్ – మహేందర్‌ రెడ్డి
సూర్యాపేట – జగదీష్‌ రెడ్డి
కొత్తగూడెం – తుమ్మల నాగేశ్వరరావు
నిర్మల్ – ఇంద్రకరణ్‌ రెడ్డి
సిరిసిల్ల (రాజన్న) – కేటీఆర్
ఆసిఫాబాద్ – జోగు రామన్న
జనగామ – మండలి ఛైర్మన్ స్వామిగౌడ్
వరంగల్ (రూరల్)- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
యాదాద్రి – నాయిని నర్సింహారెడ్డి
పెద్దపల్లి – ఈటల రాజేందర్
కామారెడ్డి – పోచారం శ్రీనివాస్ రెడ్డి
జోగులాంబ – లక్ష్మారెడ్డి
మేడ్చల్ (మల్కాజిగిరి) – తలసాని శ్రీనివాస్ యాదవ్
జయశంకర్ – స్పీకర్ మధుసూదనాచారి
జగిత్యాల – డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ
వనపర్తి – ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి
నాగర్ కర్నూలు – జూపల్లి కృష్ణారావు
మహబూబాబాద్ – చందూలాల్

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories