పాత ప్రభుత్వం మీద ఆవేశమా? కొత్త ప్రభుత్వం మీద ఆశా?

Telangana Secretariat Employees Grand Welcome To Kodandaram

ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కేసీఆర్ కు విధేయులుగా వ్యవహరించిన సచివాలయం ఉద్యోగులు తాజా పరిణామాలతో వారి మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టారు.ముందుగా బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ తెలంగాణలో ఏర్పడిన నూతన ప్రభుత్వానికి తమ శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు.

ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసి బిఆర్ఎస్ పార్టీ కి వ్యతిరేకంగా కూటములు కట్టి ప్రభుత్వం పై పోరాటాలు చేసిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫిసర్ కోదండరామ్ కు సచివాలయం ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. గత ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష పార్టీలకు సైతం ఈ సచివాలయంలోకి అనుమతి ఉండేది కాదు.అటువంటిది ఏకంగా సచివాలయం ఉద్యోగులు తమ భుజాల పై మోస్తూ కోదండరామ్ ను సచివాలయంలోకి తీసుకువెళ్లారు.

ADVERTISEMENT

ఇంతకాలం కేసీఆర్ పై పోరాడిన కోదండరామ్ పట్ల సచివాలయం ఉద్యోగులు ఇంతటి ఆదరణ, అభిమానం చూపిస్తున్నారు అంటేనే అర్ధమవుతుంది కేసీఆర్ వైఖరి పట్ల ప్రభుత్వ ఉద్యోగులలో ఎంతటి వ్యతిరేకత గూడుకట్టుకుంది అనేది. అలాగే తనకు ఇంతటి స్వాగత మర్యాదలు చేసిన ఉద్యోగులను ఉద్దేశించి కోదండరామ్ కూడా ఇలా మాట్లాడారు. కేసీఆర్ మీ హక్కులను హరించివేశాడు.

అలాగే గత ప్రభుత్వం మీ పై తీవ్ర పని ఒత్తిడి సృష్టించి పనికి తగిన గుర్తింపు ఇవ్వలేక పోయింది. ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మీ హక్కులను గౌరవించేలా,మీ సమస్యలను పరిష్కరించేలా, మీకు ప్రభుత్వానికి మధ్య వారధిలా నేను పని చేస్తానంటూ సచివాలయ ఉద్యోగులకు హామీ ఇచ్చారు ప్రొఫిసర్ గారు. అలాగే ఉద్యోగులు కూడా నూతన ప్రభుత్వానికి సహకరించి తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటును అందించాలంటూ కోరుకున్నారు.

ప్రభుత్వం మారగానే ప్రభుత్వం మీద పోరాడిన వ్యక్తులకు సచివాలయ ఉద్యోగులు ఇంతటి గౌరవ మర్యాదలు అందిస్తున్నారంటే ఇది “గత ప్రభుత్వం మీద ఉన్న ఆవేశమా? లేక ఈ ప్రభుత్వం మీద ఉన్న ఆశా?”అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ప్రభుత్వాలను మార్చాలంటే ముందు నడుం బిగించేది మాత్రం ఈ ప్రభుత్వ ఉద్యోగులే అనేది ఎన్నో సందర్భాలలో రుజువవుతూనే వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇందుకు మినహాయిపు కాదనేది స్పష్టమయ్యింది.

ADVERTISEMENT
Latest Stories