తెలంగాణ రాజకీయం: రూపం మార్చుకుందా.?

KCR and Kavitha in Telangana politics amid caste-based shift

తెరాస, బిఆర్ఎస్ గా మారినట్టు తెలంగాణ రాజకీయం ప్రాంతీయ వాదాన్ని వదిలి కులం కుంపటిలోకి వెళుతుంది. అయితే ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలు ‘జై తెలంగాణ నినాదం’తో నిండిపోగా ఇప్పుడు తెలంగాణ రాజకీయం ‘జై బీసీ’ అనే నినాదం చుట్టూ తిరుగుతున్నాయి.

తెలంగాణ రాజకీయాలు ఇంతలా రూపం మార్చుకున్నా ప్రత్యేక తెలంగాణ సాధించిన కేసీఆర్ మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. బిఆర్ఎస్ ఓటమి భారం నుంచి బయటకు రాలేకపోతున్నారు. మొన్నటి వరకు ప్రత్యేక తెలంగాణ అంటూ కేసీఆర్ తెరాస తో తెలంగాణకు ప్రాంతీయ వాదాన్ని నూరిపోస్తే, బీసీల హక్కులు అంటూ కాంగ్రెస్ తో సహా తీన్మార్ తెలంగాణకు కుల రాజకీయాలను జోడిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే తెరాస నుంచి బిఆర్ఎస్ గా మారిన కేసీఆర్ గులాబీ పార్టీ తెలంగాణలో ఎం సాధించిందో ఇక ఇప్పుడు ప్రాంతీయ వాదాన్ని వదిలి కుల రాజకీయాల వైపు అడుగులేస్తున్న రాజకీయ నేతలు కూడా అదే ఫలితాన్ని పొందే అవకాశం లేకపోలేదు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుల రాజకీయాల నుండి లబ్ది పొందేదుకు గాను తనకున్న అధికారాన్ని ఆయుధంగా వాడుకుంటుంటే బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ వేటు తో బయటకొచ్చిన కవిత సామజిక న్యాయం అంటూ బీసీ నినాదంతో ముందుకెళ్తుంది.

దీనితో తండ్రి కేసీఆర్ పార్టీకి ప్రాంతీయవాదం పునాదిగా నిలిస్తే కూతురు రాజకీయానికి కులం ఆధారం కానుందా.? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక కేసీఆర్ ప్రాంతీయ వాదాన్ని ఎత్తుకుని, టీడీపీ ని కాదని తెరాస పార్టీని స్థాపించినట్టు కాంగ్రెస్ ను వదులుకుని తీన్మార్ మల్లన్న టిఆర్పి పార్టీ ఏర్పాటుతో బీసీ నినాదాన్ని మోస్తున్నారు.

అయితే ఎన్నో ఏళ్ళ రాజకీయ పోరాటాలతో, ఎంతోమంది రాజకీయ నేతల ఉద్యమాలతో, మరెంతోమంది అమాయక యువత బలిదానాలతో, బంగారు తెలంగాణ లక్ష్య సాధనే ధ్యేయంగా, ప్రాంతీయులకే నీళ్లు, నియామకాలు అనే స్పూర్తితో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ ఇప్పుడు రూపం మార్చుకుని కుల రాజకీయ మంటలలో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తుంది.

ADVERTISEMENT
Latest Stories