రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నగారా మోగించడంతో ఖమ్మం జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐలు కూటమిగా బరిలోకి దిగుతాయన్న ప్రచారం జరుగు తోంది. రాష్ట్రస్థాయిలో ఇప్పటికీ పొత్తుల సంప్రదింపులు మొదలు కాకపోయినా జిల్లాలో మాత్రం సీట్లు సర్దుబాటు జరిగినట్టు ప్రచారం నడుస్తోంది. టీడీపీ ఖమ్మం ఎంపీ సీటుతో పాటు అశ్వారావుపేట, సత్తుపల్లి, భద్రాచలం మూడు నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది.
[m9ad]
అయితే కాంగ్రెస్‌లో ఒక వర్గం పొత్తులకు అనుకూలంగా ఉండగా మరో వర్గం వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. ఖమ్మం పార్లమెంటు సీటును గతసారి వదులుకుని నష్టపోయామని, ఈసారి తామే పోటీచేస్తామని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతు న్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ మాజీ నేత నామ నాగేశ్వరరావు ఖమ్మం సీటును టీడీపీ నుంచి ఆశిస్తున్నారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకాచౌదరి కూడా ఎంపీ సీటును ఆశిస్తున్నారు. ఇద్దరు ఖమ్మంపైనే దృష్టి సారించడంతో పొత్తులు, సీట్ల సర్దుబాటులో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ విషయంగా చంద్రబాబు నాయుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు



