ఊహలపల్లకీలో కామ్రేడ్లు?

thammineni veerabhadram Over Confidenceవృద్ధాప్యదశలో రేపా మాపా అన్నట్టు ఉన్న కామ్రేడ్ల ఆవేశం మాత్రం చల్లారలేదు. ఏకంగా తెలంగాణాలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ముప్పై ఒక్క బహుజనపార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తామని ఆయన చెబుతున్నారు.

ADVERTISEMENT

టిఆర్ఎస్,కాంగ్రెస్ లకు ప్రత్యామ్నయాంగా తాము పోటీలో దిగుతామని, ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పెను మార్పులు వచ్చాయని, ఎర్రజెండా సత్తాను చూపించడానికి ఇది మంచి అవకాశమని ఆయన అంటున్నారు. ఫ్రంట్‌లో చేరాలని లెఫ్ట్‌ పార్టీలతో చర్చించగా.. సీపీఐ అందుకు అంగీకరించలేదని ఆయనే అన్నారు.

లెఫ్ట్ పార్టీలలో ఎంతోకొంత బలమైనవి సీపీఎం, సీపీఐలే వారి మధ్యనే సఖ్యత ఉండదు. కావున ఇలాంటి అతుకులబొంత లాంటి కూటమితో ఏకంగా రాజ్యాధికారమే సాధించేస్తాం అని వారు అంటుంటే ఏమనుకోవాలి? 119 స్థానాల్లో తరువాత కనీసం 20 స్థానాలలో అయినా పోటీ చెయ్యగల సత్తా వారికి ఉందా?

ADVERTISEMENT
Latest Stories