ఇద్దరు టాలీవుడ్ స్టార్ల తో ది ఫ్యామిలీ మాన్ 2 దర్శకుల చర్చలు?

The Family Man 2 director talks with two Tollywood starsఆంధ్రప్రదేశ్ వారైన దర్శకులు రాజ్ & డీకే బాలీవుడ్‌లోనే తమ ప్రస్థానం మొదలుపెట్టి అక్కడ టాప్ డైరెక్టర్లుగా బిజీగా ఉన్నారు. గో గోవా గాన్, స్త్రీ, ది ఫ్యామిలీ మ్యాన్ వంటి సంచలనాత్మక ప్రాజెక్టులతో తమకంటూ ఒక పేరు సంపాదించారు. వారు ఇంకా తెలుగు డైరెక్షనల్ అరంగేట్రం చేయాల్సి ఉంది. అది ఎప్పుడు జరుగుతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

“రెండేళ్ల క్రితమే మేము తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేయవలసి ఉంది, కాని కొన్ని లాజిస్టిక్స్ సమస్య కారణంగా ఇది ఆలస్యం అయింది. మహేష్ బాబు మరియు విజయ్ దేవరకొండల కోసం మేము ఇటీవల కొన్ని ఐడియాలు చెప్పాము. మీరు చాలా త్వరగా దానికి సంబంధించి ఏదో వినబోతున్నారని మాత్రం మేము చెప్పగలం” అని వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు .

ADVERTISEMENT

రాజ్ & డీకే గత వారం సినిమా బండి అనే పేరుతో ఒక చిన్న తెలుగు చిత్రాన్ని నిర్మించారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలోని తారాగణం లో ఒక్క తెలిసిన ముఖం కూడా లేనప్పటికీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండ్స్ జాబితాలో # 1 స్థానంలో ఉంది.

మంచి ప్రతిభను వెలికితీయడం, వెలికి తీసి వారిని ప్రోత్సహించడంలో ఈ యువ దర్శకులు ముందు ఉంటారు అనడం సినిమా బండి విజయమే నిదర్శనం. ఇటువంటి దర్శకులు తెలుగులోకి వచ్చి సినిమాలు చేస్తే మంచి విషయం ఉన్న సినిమాలు వస్తాయి అనడంలో ఎటువంటి అనుమానం ఉండదు.

ADVERTISEMENT
Latest Stories