ఒక కులాన్ని ఆధారం చేసుకుని ఏ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ ఎదగలేడు, ముందుకు సాగలేడు. అలా అని తన సొంత సామజిక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదు.
కానీ వైసీపీ పార్టీలో ఉంటున్న కొంతమంది కాపు నాయకులు తమ రెడ్డి గారి నాయకత్వాన్ని మెప్పించడానికి, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన దగ్గర మెప్పులు పొందడానికి తమ సొంత సామజిక వర్గం మీద కూడా విమర్శలు చేయడానికి వైసీపీ కాపు నాయకులు వెనుకాడరు అనేది మరోసారి రుజువుఅయ్యింది.
గతంలో వైసీపీ మాజీ మంత్రులుగా పని చేసిన పేర్నినాని కానీ, అంబటి రాంబాబు కానీ తమ కాపు కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి ఆ సామజిక వర్గం నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడానికి మీడియా ముందుకొచ్చిన ఈ పెద్ద మనిషి మేమంతా కాపు నా…..లం అంటూ తన సామజిక వర్గాన్ని కించపరిచారు, అలాగే నేను జగన్ రెడ్డి దగ్గర పెద్దపాలేరుని అని చెప్పుకోవడానికి సగర్వంగా ఉంది అంటూ పేర్నినాని చేసిన కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఇక అంబటి రాంబాబు అయితే కాపులంటే తెలివి తక్కువ వారు, అవేశపరులు, మాంసాన్ని ఎక్కువగా తింటారు, మందు బాగా తాగుతారు అంటూ తన సొంత సామజిక వర్గాన్ని, ఆ వర్గానికి చెందిన ప్రజలను ఉద్దేశించి నోరుపారేసుకుని విమర్శలపాలయ్యారు. గత ఐదేళ్ల వీరి నోటి దూల వ్యక్తిగతంగా వారికి వారి రాజకీయ జీవితానికే కాదు వైసీపీ పార్టీకి ఒక మంచి గుణపాఠాన్ని నేర్పించిందనే చెప్పాలి.
ఇక వీరి బాటలోనే ఇప్పుడు వైసీపీ మరో కాపు నేత తోట త్రిమూర్తులు కూడా తన నోటికి పని చెప్పారు. కార్తీక కాపువనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తోట కాపు జాతి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఒక రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి ఆయన ఒక కారు కొంటె అబ్బో మా రెడ్డి గారు ఒక కారు కొన్నారురా అంటూ గొప్పగా చెప్పుకుంటాం.
అలాగే ఒక చౌదరి దగ్గర పని చేసిన అయన ఒక బిల్డింగ్ కొన్న ఆహా మా చౌదరి గారు ఒక పెద్ద బిల్డింగ్ కొన్నార్రా అంటూ ప్రచారం చేసుకుంటాం, అదే ఒక కాపు వాడు ఒక స్కూటర్ వేసుకెళ్తున్నా వీడు ఇదెక్కడో దొబ్బుకొచ్చాడ్రా అంటూ చులకనగ మాట్లాడతాం, కాపుల నుంచి ఎవడైనా వచ్చి ఒక నాయకుడిగా ఎదగాలన్న వాడిని అందరు కిందకు లాగేవాళ్ళే ఉంటారు అంటూ తన సొంత సామజిక వర్గం పై కీలక వ్యాక్యలు చేసారు.
ఇప్పుడు తోట త్రిమూర్తులు చేసిన ఈ వ్యాఖలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వైసీపీ కాపు నేత మీద కూడా విమర్శలు మొదలయ్యాయి. ఒక సామజిక వర్గం పేరు చెప్పుకుని రాజకీయ అవకాశాలు దక్కించుకోవడం, ఆ వర్గం ప్రజలను అండగా చేసుకుని రాజకీయంగా ఎదగడం చివరికి అదే సామజిక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం వైసీపీ కాపు నాయకులకు అలవాటుగా మారిపోయింది.




