ట్రైలర్ టాక్ – బాగుంది… మ్యూజిక్ మేజర్ హైలైట్..!

Tholi Prema Theatrical Trailer శేఖర్ కమ్ముల “ఫిదా” తర్వాత వరుణ్ తేజ్ ఫేట్ మారినట్లుగా కనపడుతోంది. మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “తొలిప్రేమ” సినిమా కూడా ‘ఫిదా’ అనుభూతులనే మిగులుస్తుందన్న నమ్మకాన్ని ట్రైలర్ ఇచ్చింది. “తొలిప్రేమ” అనే సినిమాలో తామేం కధ చెప్పబోతున్నామో అన్న దానిని ట్రైలర్ లో స్పష్టంగా చూపించారు. 110 సెకన్ల నిడివి గల ట్రైలర్ ఎంటర్టైనింగ్ గానూ, ఆసక్తికరంగానూ సాగడంతో “తొలిప్రేమ” రైట్ ట్రాక్ లో పయనిస్తోంది.

ADVERTISEMENT

‘ఫిదా’కు సాయిపల్లవి ఎలా అయితే ప్లస్ పాయింట్ అయ్యిందో, ఈ ‘తొలిప్రేమ’కు కూడా రాశి ఖన్నా ప్లస్ పాయింట్ అని ట్రైలర్ లో ఆమె ఇచ్చిన హావభావాలు చెప్పకనే చెప్పాయి. ఇక ఈ సినిమాకు మేజర్ హైలైట్ ఎస్.ఎస్.థమన్ అందించిన సంగీతం అని చెప్పొచ్చు. మంచి ఫీల్ ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థమన్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ లా నిలిచినట్లుగా కనపడుతున్నాడు. దీంతో వరుణ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories