వైసీపి ఓటమికి మూడు కారణాలు… ఒకటి జగన్‌…

YS_Jagan_YSRCP_Ministers_MLA

త్వరలో జరుగబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వైసీపి ఓటమికి మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1. వైసీపి అభ్యర్ధులపై జగన్‌ అనాలోచిత నిర్ణయాల ప్రభావం. 2. ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తున్న వైసీపి అభ్యర్ధుల అవినీతి, దోపిడీ, అరాచకాలు. 3. వైసీపి నేతల నోటి దురుసు, ప్రేలాపనలు.

ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్‌ రెడ్డి రివర్స్ టెండరింగ్, కూల్చివేతలు, వైసీపి రంగులు, మూడు రాజధానులు, విశాఖ రాజధాని, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వంటి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఆ కారణంగా ప్రభుత్వ వైఫల్యాలు భూతద్ధంలో నుంచి చూసిన్నట్లు మరింత పెద్దగా కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT

అభివృద్ధిని విస్మరించి సంక్షేమ పధకాలతో ముందుకు సాగాలనుకోవడం, చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించడం వంటివన్నీ జగన్‌ సొంత నిర్ణయాలే తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తున్న వైసీపి అభ్యర్ధులకు వాటితో సంబందమే లేదని చెప్పవచ్చు.

కానీ ‘వైసీపి అంటే జగన్మోహన్‌ రెడ్డి… ఆయన ఫోటో మాత్రమే’ అని ఆయనతో సహా వైసీపి నేతలందరూ పదేపదే చెప్పుకుంటున్నారు. కనుక జగన్‌ నిర్ణయాలతో పార్టీలో ఎవరికీ సంబందం లేకపోయినా, ఈ ఎన్నికలలో వైసీపి అభ్యర్ధులందరూ వాటికి జవాబుదారీగా మారాల్సి వస్తోంది.

టిడిపిలో ఉన్నట్లే వైసీపిలో కూడా బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావు, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, పినిపె విశ్వరూప్, వల్లభనేని వంశీ వంటి కొందరు కొమ్ములు తిరిగిన నాయకులు, అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరు జగన్‌ పేరు చెప్పుకోకుండా, ఫోటో లేకుండా తమ సొంత బలంతో నెగ్గగలవారే.

కానీ జగన్‌ అనాలోచిత, విచిత్రమైన నిర్ణయాలు, విధానాల వలన ఇప్పుడు వీరందరూ కూడా ఎన్నికలలో ఎదురీదవలసివస్తోంది.

ఈవిదంగా జరుగుతుందని బహుశః వారు ముందే ఊహించి ఉండవచ్చు కానీ జగన్‌ నిర్ణయాలను వైసీపిలో అందరూ తల దించుకొని, చేతులు కట్టుకొని అంగీకరించడమే తప్ప ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు. ఉన్నవారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా మెడపట్టుకొని బయటకు గెంటేయబడ్డారు. కనుక ఇప్పుడు ఎన్నికల బరిలో ఉన్నవారు జగన్‌ అనాలోచిత నిర్ణయాలకు, వైఫల్యాలకు మూల్యం చెల్లించాల్సి వస్తోంది.

ఇక వైసీపిలో అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, అనిల్ కుమార్‌ యాదవ్‌వంటివారు తమ నోటి దురుసుతనానికి, ప్రేలాపనల వలన నష్టపోయే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

వైసీపిలో మూడో రకం అభ్యర్ధులు కూడా ఉన్నారు. వారు ఈ 5 ఏళ్ళలో ఇసుక, మట్టి, గ్రానైట్, కొండలు, గుట్టలు విచ్చలవిడిగా దోచేసుకొని మాఫియా సామ్రాజ్యాలు స్థాపించుకున్నారు. వారి వలన ఆయా ప్రాంతాలు, అక్కడ నివసించే ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కనుక ఇప్పుడు ఆ మాఫియా మారాజులను ఓడగొట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు.

కనుక గత ఎన్నికలలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపి ఈ స్వయంకృతాపరాధాల వలననే ఈసారి ఎన్నికలలో ఓడిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories