ఏపీలో మరో ప్రేస్టేజియస్ ప్రాజెక్ట్!

Titan Solar in Andhra Pradeshఆంధ్రప్రదేశ్ కు మరో కీలక ప్రాజెక్టు రాబోతోంది. సోలార్ బ్యాటరీ తయారీలో అగ్రగామిగా పేరు గాంచిన ‘ట్రైటన్ సోలార్’ ఏపీలో తమ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా 727 కోట్లతో సోలార్ బ్యాటరీ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ట్రైటన్ కంపెనీ ప్రతినిధులు, ఏపీ అధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

ADVERTISEMENT

[m9ad]

ప్లాంటు ఏర్పాటుకు 100-200 ఎకరాల భూమి అవసరమని ట్రైటన్ కంపెనీ ఛైర్మన్‌ హిమాంశు పటేల్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం దశల వారీగా పెట్టుబడులు పెడతామని, ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఈ సోలార్ బ్యాటరీల తయారీకి నానో టెక్నాలజీ ‘లిథియం పాలిమర్‌’ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. తమ ప్రభుత్వం సోలార్ వాహనాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories