కోదండరాం బీజేపీవైపు వెళ్తారా?

TJS Kodandaram eyeing BJPమహాకూటమిలో చీలిక వస్తుందా? తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం బీజేపీవైపు వెళ్తారా? జరగొచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. మహా కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. సీట్ల విషయంలో అవగాహన కుదరకపోతే, తాము కోరిన సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగానే పోరుకు దిగాలని తెలంగాణ జన సమితి నిర్ణయించింది.

ADVERTISEMENT

[m9ad]

మరోవైపు సీట్ల పంపకం తేల్చకుండా కాంగ్రెస్ తన మొదటి లిస్టును విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతుంది. ఒకవేళ మహాకూటమి కుదరకపోతే బీజేపీతో కలిసి వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. కోదండరాం వస్తారనే ఆశతో బీజేపీ ఇప్పటికే సిద్ధంగా ఉన్న తన రెండవ లిస్టును నవంబర్ మొదటి వారంకు పోస్టుపోన్ చేసింది.

భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 38 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకముందు టిడిపికి పదిహేను, సిపిఐకి ఐదు, టిజెఎస్ కు ఎనిమిది సీట్లు వరకు రావచ్చని ప్రచారం జరిగినా, తాజాగా కాంగ్రెస్ మాట మార్చినట్టు సమాచారం. టిడిపికి తొమ్మిది, సిపిఐకి రెండు తెలంగాణ జనసమితికి మూడు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసిందని సమాచారం వస్తోంది కోదండరాం పార్టీకి గెలిచే అవకాశం లేకపోయినా ఆ పార్టీ మహాకూటమి నుండి బయటకు వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది తెరాసకు బెనిఫిట్ అవ్వొచ్చు.

ADVERTISEMENT
Latest Stories