vijaya-sai-reddy-visakhapatnam-drugs

వైసీపిలో జగన్‌ తర్వాత అంత శక్తివంతుడుగా పేరు పొందిన వ్యక్తి విజయసాయి రెడ్డి. అలాగే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్ తర్వాత అంత అప్రదిష్ట మూటగట్టుకున్నవారు కూడా ఆయనే.

ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా? అనేది ఎవరికీ అవసరం లేదు. ఎందుకంటే ఆ స్థాయి నాయకుడిపై అటువంటి ఆరోపణలే అందరికీ ఆసక్తి కలిగిస్తాయి.

Also Read – ఒక్క హిట్ ప్లీజ్…

ఆయన అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే వైసీపిలో ఎవరూ ఆయనకు అండగా నిలవకపోవడం ఆయనకు ఇంకా బాధ కలిగించి ఉండవచ్చు. బహుశః ఓటమి తర్వాత సజ్జలని పక్కకు తప్పిస్తున్నట్లే, విజయసాయి రెడ్డిని కూడా జగన్‌ పక్కకు తప్పిస్తున్నారేమో తెలీదు.

కనుక ఆయన బీజేపీవైపు చూస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఆయనను బీజేపీ చేర్చుకుంటుందా? చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా? అనేవి వేరే విషయాలు.

Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్‌: హ్యాండ్సప్

అయితే విజయసాయి రెడ్డి ఇంకా వైసీపిలోనే ఉన్నారు కనుక ఆ కోణంలో నుంచే ట్వీట్లు వేస్తున్నారు.

“నిష్పక్షపాతంగా పనిచేయగల మీడియా ప్రజాస్వామ్యాన్ని కాపాడగలవు. ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చేయగలదు. కానీ ఆంధ్రాలోని దాదాపు అన్ని మీడియా సంస్థలు ఓ కులం ప్రభావంతోనే పనిచేస్తున్నాయి. తప్పుడు వార్తలు ప్రచురిస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయి. కనుక మీడియా సమూల ప్రక్షాళన చాలా అవసరం ఇప్పుడు,” అని విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.

Also Read – టీటీడీ నోటీసులతో వైసీపీ గురువు ఇబ్బంది

అది చూసి టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ‘దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని’ ఎద్దేవా చేశారు.

అధికారంలో ఉన్నంత కాలం అక్కడ కేసీఆర్‌, ఇక్కడ జగన్‌కి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రతిపక్షాలు, మీడియా, చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు వారి కంటికి ఆనలేదు. తమ తెలివితేటల ముందు అన్నీ బలాదూర్ అనుకున్నారు. తమ ఫోటో ఒక్కటి చాలు వరుసవిజయాలు సాధించడానికి అని గుడ్డి భ్రమలో జీవిస్తూ అందరినీ కూడా భ్రమింపజేసి చివరికి వారే నష్టపోయారు.

ముఖ్యంగా జగన్‌ అరాచక పాలనలో ప్రతిపక్షాలు, మీడియాని ఎంతగా హింసించారో, ఈసడించుకున్నారో అందరికీ తెలుసు. అదే సమయంలో ఆయన సొంత మీడియాతో ప్రతిపక్షాలు సాటి మీడియా సంస్థలపై ఎంతగా బురద జల్లారో అందరికీ తెలుసు.

కానీ ఇప్పుడు ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విలువల గురించి మాట్లాడుతూ, అవే తమని కాపాడాలని ఆశిస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది.

తమ సొంత మీడియాలో రాసిన రాతలు, కూసిన కూతలను మరిచిపోయిన్నట్లు, మీడియాను ఓ కులం శాసిస్తోందని, కనుక ప్రక్షాళన చేయాలని విజయసాయి రెడ్డి చెపుతున్నారు.

ఒకవేళ మీడియాని వైసీపి ప్రక్షాళన చేయాలని కోరుకుంటే, ముందుగా తమ సొంత మీడియాతోనే ఆ పని మొదలుపెడితే బాగుంటుంది.

దానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి తమ గురించి, తమ పార్టీ గురించి, తమ అధినేత ధోరణి గురించి నిష్పక్షపాతంగా వ్రాయమని కోరితే వేరే మీడియా అవసరం లేదు. వారి సొంత మీడియానే వారి కళ్ళు తెరిపించగలదు.