గుజరాత్ లో బీజేపీ డాబుకు బాబు దెబ్బ!

Toyota - Cars in Andhra Pradeshజపాన్‌కు చెందిన టయోటా కంపెనీ తాను తయారు చేస్తున్న రెండు హైబ్రిడ్‌ మోడళ్ల కార్లను భారత్‌లో తొలిసారిగా లాంచ్‌ చేయనుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌, మహారాష్ట్రలు తీవ్రంగా పోటీ పడ్డాయి. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో తమ రాష్ట్రానికి రావాలని…ఇది ఎన్నికలవేళ లబ్ది చేకూరుస్తుందని పైస్థాయి నుంచి టయోటాతో సంప్రదింపులు జరిగాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ అవకాశం అమరావతికి తెచ్చారు. ఈ మేరకు ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి 10 ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉచితంగా అందించనుంది. అమరావతిని ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రయోగ, ప్రచార కేంద్రంగా ఉపయోగించుకోబోతుంది టయోటా.

ADVERTISEMENT

టయోటాకి ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంట్‌ భారత్‌లో లేదు. టయోటాతో ఒకసారి బంధం ఏర్పడితే ఆ తర్వాత ఇ-కార్ల తయారీ ప్లాంట్‌ను ఏపీలో పెట్టాలని కోరే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి టయోటా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories