గత నాలుగైదు నెలలుగా ఉచిత ఆఫర్లతో కోట్ల మంది వినియోగదారులతో కళకళలాడుతోన్న రిలయన్స్ జియోపై ప్రత్యర్ధి కంపెనీలు ట్రాయ్ కు దఫాల వారీగా ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే. ‘వెల్ కం ఆఫర్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని పేర్లు వేరైనా… అవన్నీ ఉచితం అనే ముసుగులోనే ఇస్తున్నవని ఫిర్యాదులు అందడంతో, తాజాగా వీటిపై టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక ప్రకటనలు చేసింది.
‘రిలయన్స్’ జియో ప్రకటించిన ఆఫర్లలో ఎలాంటి తప్పులు దొర్లలేదని, ‘వెల్ కం ఆఫర్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ పేరిట జియో ప్రకటించిన ‘ఫ్రీ టారిఫ్’ ఆఫర్లు రెండూ వేర్వేరు అని ట్రాయ్ తాజాగా తేల్చి చెప్పింది. మార్చి 1, 2017 వరకు ‘జియో’ ఆఫర్ చేసిన ఉచిత డేటా, వాయిస్ సేవలను వినియోగదారులు నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చని ట్రాయ్ స్పష్టం చేసినట్లయ్యింది.
‘జియో’ ప్రకటించిన ఫ్రీ టారిఫ్ ఆఫర్లు జీవిత కాలం ఇవ్వడం సాధ్యం కాదని టెల్కోలు వాదించగా, భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ సహా ఇతర ఆపరేటర్లకు ఈ మేరకు ఈ ఆదేశాలు అందనున్నాయి. కాగా, జియో ఆఫర్ పై ఎయిర్ టెల్, ఐడియా వంటి టెలికాం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా జియో ఫ్రీ కాలింగ్ ఆఫర్ పై ఎయిర్ టెల్ సంస్థ చైర్మన్ సునీల్ మిట్టల్ అభ్యంతరం వ్యక్తం చేయడం, టెలికాం ట్రైబ్యునల్ ను ఆశ్రయించడం తెలిసిందే.
Win Rs.1000 Paytm for closest guess of @NameisNani 's #NenuLocal USA Premiere Collections ends by Thur 7pm IST#M9NewsWin1000 3rd contest pic.twitter.com/PcsmdS09lQ
— M9News (@M9News) 31 January 2017



