మాటల మాంత్రికుడు ఇప్పుడు సినిమా థియేటర్ ఓనర్

Trivikram Srinivas Rayudu Theatre - Rajanagaramమొన్న ఆ మధ్య ఆజ్ఞతవాసితో పెద్ద ప్లాఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ వెనువెంటనే అరవింద సమేతతో తిరిగి ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ తో ఒక సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ తూర్పు గోదావరి జిల్లా ఒక సినిమా థియేటర్ కొనుగోలు చేశారట. రాజానగరంలోని రాయుడు అనే సినిమా థియేటర్ ను కొని ఇప్పుడు దానిని ఆధునిక హంగులతో ముస్తాబు చేస్తున్నాడట. దీనికి దాదాపుగా ఐదు కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టాడట. ప్రస్తుతం రేనోవేషన్ కోసం మూసి వెయ్యబడిన ఈ థియేటర్ తొందరలో ఓపెన్ కాబోతుంది.

స్టార్ హీరోలను ఈ థియేటర్ ఓపెనింగ్ కు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్. ఇప్పటివరకూ టాలీవుడ్ లో తేజ, వినాయక్ లాంటి దర్శకులకు సినిమా థియేటర్లు ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకులలో ఒకరైన త్రివిక్రమ్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాలలో రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. అటువంటిది తూర్పు గోదావరి జిల్లాలోని ఒక చిన్న పట్నమైన రాజానగరంలో త్రివిక్రమ్ పెట్టుబడి పెట్టాడు అంటే అది విషయమే.

ADVERTISEMENT

ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో బన్నీ సరసన అందాల భామ పూజా హెగ్డే చిందులేస్తోంది. ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో ఎమోషన్ ప్లస్ యాక్షన్ అన్ని కలగలసి హ్యాట్రిక్ హిట్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని పక్కాగా రూపొందించినట్టు ఫిలిం నగర్ టాక్. ఈ సినిమా సంక్రాంతికి గానీ సమ్మర్ లో గానీ విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories