ముందస్తు ఎన్నికలకు సన్నాహంగా తెరాస నిన్న పెట్టిన ప్రగతి నివేదన సభ అనుకున్న రీతిలో జరగలేదు. 25 లక్షల మంది వస్తారని అంచనా వేసిన వచ్చిన వారు ఐదు లక్షల లోపే ఉంటారని సమాచారం. దీనితో అధికార పార్టీలో నిర్వేదం ఏర్పడింది. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటే పరిస్థితులు కలిసి వస్తాయా?రావా అన్నది మంత్రుల సందేహం.
[m9ad]
ముఖ్యంగా అసెంబ్లీ రద్దు తర్వాత కేవలం తాత్కాలిక కేర్ టెకర్ ప్రభుత్వమే ఉంటుందని, దానికి అన్ని అదికారాలు ఉండవని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.అలాంటప్పుడు అదికారులు ఇప్పుడు విన్నట్లుగా అప్పుడు మాట వింటారా అన్నది వారు ప్రదాన డౌటుగా ఉంది.అందులోను మంత్రుల మాటను అసలు వినకపోవచ్చని వారు భయపడుతున్నారు.
అలాగే జనవరిలో ఓటర్ల జాబితా సిద్దం అవుతుందని,ఈలోగా ఎన్నికలంటే గత జనవరి వరకు ఉన్న జాబితానే వాడుకోవాలని, దానివల్ల కొత్త ఓటర్లకు అవకాశం ఉండదని,అందుకు ఎన్నికల సంఘం ఒప్పుకుంటుందా అన్న సందేహం కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు డిసెంబరులో జరగకుండా ఎన్నికల సంఘం వాయిదా వేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని వారి భయం.



