మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్‌: హ్యాండ్సప్

Trump Faces Protest Over Immigration

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ విదేశాల పట్ల, అమెరికాలో ఉన్నత విద్యలు, ఉద్యోగాల కోసం వచ్చిన విదేశీయుల పట్ల అనుసరిస్తున్న విధానాలను గట్టిగా సమర్ధించుకోవచ్చు. ఆయన అధికారాలకు తిరుగు లేదు కనుక ప్రపంచదేశాలు కూడా ఎదిరించి మాట్లాడలేకపోయి ఉండొచ్చు.

ADVERTISEMENT

కానీ అంత మాత్రాన్న ఆయన నిర్ణయాలు, విధానాలు సరైనవే అని అంగీకరించలేమని అమెరికా పౌరులే అంటున్నారు. ట్రంప్‌ విదానాలను నిరసిస్తూ వేలాదిగా అమెరికన్ పౌరులు న్యూయార్క్ నగరంలోని ప్రధాన గ్రంధాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలిపారు. అమెరికాలో పలు రాష్ట్రాలలో కూడా ‘హ్యాండ్సప్’ పేరుతో నిరసనలు తెలుపుతున్నారు.

“అమెరికాలో రాజులు ఎవరూ లేరు.. మనది ప్రజాస్వామ్య దేశం. అందరినీ సమానంగా గౌరవించాలి. ట్రంప్‌ దౌర్జన్యాన్ని ఎదిరిద్దాము,” అంటూ ఆమెరికన్స్ నిరసనలు తెలుపుతున్నారు.

ఇవి ట్రంప్‌ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు అని అర్దమవుతూనే ఉంది. ట్రంప్‌ విధానాలను అమెరికన్ పౌరులే అంగీకరించనప్పుడు ప్రపంచ దేశాలు అంగీకరించాలని ఎలా ఆశించగలరు? అయినా ఈ ఆందోళనల వెనుక ఇంకా అనేక బలమైన కారణాలు కూడా ఉండి ఉండవచ్చు.

అమెరికన్లు పలు విదేశీ ఉత్పత్తులు వాడుతుంటారు. విదేశీ సంస్థలు, ఉద్యోగులు, విద్యార్ధుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సేవలు పొందుతుంటారు. కానీ ట్రంప్‌ నిర్ణయాలు, సుంకాలు, ఆంక్షల వలన వారికీ అవన్నీ లభించకపోవచ్చు లేదా విదేశీయుల పట్ల ట్రంప్‌ అంత కటువుగా వ్యవహరిస్తుండటం వారికి అభ్యతరకరంగా అనిపించి ఉండొచ్చు.

కారణాలు ఏవైనప్పటికీ డోనాల్డ్ ట్రంప్‌ నిర్ణయాలను సగటు ఆమెరికన్స్ వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నిరసనలు ప్రతిపక్ష కుట్ర అని ట్రంప్‌ వాదించవచ్చు. కానీ ట్రంప్‌ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే అమెరికన్ ప్రజలు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోరని స్పష్టం చేస్తున్నారు కదా?

ADVERTISEMENT
Latest Stories