
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందూ వెనుకా చూడకుండా మహాలక్ష్మి పధకం కింద రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. అప్పటి నుంచి ఆర్టీసీకి కష్టాలు మొదలయ్యాయి.
Also Read – ఫోన్ ట్యాపింగ్: ఒక్క ట్విస్టుతో కధ క్లైమాక్స్‌కి.. భలే ఉందే!
రోజుకి కొన్ని లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తుంటారు. వారి టికెట్స్ ద్వారా వచ్చే ఆదాయం కోల్పోవడమే కాక బస్సులన్నీ మహిళలలో కిక్కిరిసిపోతుండటం టికెట్స్ కొనుకొని ప్రయాణించే పురుషులకు బస్సులలో చోటు లభించడం లేదు. ఆ మేరకు మరికొంత ఆదాయం కోల్పోతోంది.
దానిని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తామని ఆర్టీసీకి హామీ ఇచ్చింది కానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో భారీగా బకాయిలు పేరుకుపోతున్నాయి. దాంతో ఆర్టీసీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది.
Also Read – అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సర్వం సిద్దం
మహాలక్ష్మి పధకం ప్రవేశపెట్టినప్పటి నుంచి తమపై పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయిందని, కనుక తక్షణం ఆర్టీసీలో కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. ఇటీవలే జీతాలు పెంచాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు.
ఒక తొందరపాటు నిర్ణయంతో ఎటువంటి పర్యవసానాలు ఎదురవుతాయో తెలుసుకునేందుకు టిజిఎస్ ఆర్టీసీయే ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది.
Also Read – జగనన్న రాజకీయ ప్రవచనాలు…
కనుక ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు గురించి తొందరపడటం లేదు… అని చెప్పడం కంటే ఆ హామీని పక్కన పెట్టిందని చెప్పవచ్చు.
కానీ ఆర్టీసీపై భారం పడకుండా 58 ఏళ్ళు నిండిన మహిళలకు, 60 ఏళ్ళు నిండిన పురుషులకు ఆర్టీసీ బస్సులలో టికెట్ ఛార్జీపై 25 శాతం రాయితీ ఇస్తోంది.
టిజిఎస్ ఆర్టీసీలా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి కంటే ఏపీఎస్ ఆర్టీసీని కాపాడుకొని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచడమే మంచిదని కూటమి ప్రభుత్వం భావిస్తుండటం వలననే ఈ ఎన్నికల హామీని పక్కన పెట్టి ఉండవచ్చు.
కానీ కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేందుకు వైసీపీకి ఇది చక్కటి అవకాశం కల్పిస్తోంది కనుక సోషల్ మీడియాలో ‘ఏపీలో ఉచిత బస్సు జీవితకాలం లేటు’ అంటూ సిఎం చంద్రబాబు నాయుడు ఫోటోతో విమర్శలు గుప్పించింది.
“మహిళలకు ఉచిత బస్సు పేరిట ఓట్లు వేయించుకుని గెలిచిన @ncbn గెలిచాక వారిని నడిరోడ్డులో వదిలేశారు. ఉచిత బస్సు పథకం అటకెక్కించిన బాబు ఇప్పుడు ఆ పథకం ఊసే లేకుండా పోయింది. దీంతో బాబు మాటలు..నీటి మూటలు అని మరోమారు రుజువైంది..” అంటూ వైసీపీ విమర్శలు గుప్పించింది.
జగన్ వాలంటీర్లను వాడుకొని రోడ్డున పడేశారు. తననే నమ్ముకున్న ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చి రోడ్డున పడేశారు. తన కోసం చెలరేగిపోయిన పార్టీ నేతలను, ఐఏఎస్, ఐపీస్ అధికారులను జైలుపాలు చేస్తున్నారు.
మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలతో సహా ఆయనకు తోడ్పడిన వారందరూ ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
కానీ చంద్రబాబు నాయుడు ఎవరినీ రోడ్డున పడేయలేదు. కేవలం ఎన్నికలలో హామీ ఇచ్చి అమలుచేయనంత మాత్రాన్న రాష్ట్రంలో మహిళలు రోడ్డున ఎలా పడిపోతారో వైసీపీయే చెప్పాలి.