జనసేన కాదు.. ధనసేన

tulasi reddy comments on pawan kalyan jana sena as dhana sena ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీ మీద కాంగ్రెస్ కూడా విమర్శల దాడి ఎక్కువ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు చేపట్టిన జనసేన కవాతుపై పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి స్పందించారు. జనసేన కవాతును .. ధనసేన కవాతు అంటే బాగుండేదేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.

[m9ad]

ADVERTISEMENT

కవాతులో హెలికాప్టర్ల నుంచి పూల వర్షం, ప్రత్యేక విమానాలు వంటివన్నీ చూస్తుంటే నీతులు చెప్పేందుకే ఉన్నాయనిపిస్తోందని తులసిరెడ్డి అన్నారు. మరో వైపు ‘చట్టసభల సభ్యుల్లో జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం కవాతు ప్రధాన ఉద్దేశం’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

పవన్‌కల్యాణ్‌ యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించనున్న నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీపై తలపెట్టిన కవాతుకు సర్వం సిద్ధమైంది. రెండు లక్షల మందితో కవాతు చేయ్యబోతున్నామని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. చ్చుకల్లంక వద్ద కవాతు ప్రారంభమవుతుంది. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర కవాతు చేయనున్నారు. అనంతరం బ్యారేజీ దిగువన ఉన్న కాటన్‌ విగ్రహం వద్ద జరిగే భారీ బహిరంగ సభలో పవన్‌ ప్రసంగిస్తారు.

ADVERTISEMENT
Latest Stories