గత కొన్ని రోజులుగా మీడియా వర్గాలలో హాట్ టాపిక్ గా మారిన బ్యూటీషియన్ శిరీష కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం… ఆమెది ఆత్మహత్య మాత్రమేనని ఇటీవల పోలీసులు నిర్ధారించారు. అయితే ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత, ఆమె లైంగికంగా దాడి జరిగిందా? లేదా? అన్న విషయం స్పష్టమవుతుందని, దాని ప్రకారం కేసు విచారణ ముందుకు వెళ్తుందని పోలీసులు చెప్పుకొచ్చారు.
అయితే పోలీస్ వర్గాలు ఎదురు చూస్తున్న ఎఫ్.ఎస్.ఎల్ ప్రాధమిక నివేదిక వచ్చినట్లుగా తెలుస్తోంది. శిరీషపై ఎలాంటి లైంగిక దాడి జరిగిన ఆనమాలు కనపడడం లేదని ఈ నివేదికలో పొందుపరిచినట్లుగా సమాచారం. స్పెర్మోటోజ కనిపించలేదని నిపుణులు ఇచ్చిన ప్రాధమిక రిపోర్ట్ కు, ఫైనల్ రిపోర్ట్ కు పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చు. దీంతో ఈ కేసులో సమాధానాలు కంటే, ప్రశ్నలు ఎక్కువయ్యేలా కనపడుతున్నాయి.
మరి స్పెర్మ్ కనిపించని పక్షంలో శిరీష ధరించిన దుస్తులపై ఉన్న మరకలు ఏంటి? అలాగే శిరీషపై ఆత్యాచారం జరగని పక్షంలో ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏముంది? ఇవి కాక శిరీష కుటుంబ సభ్యులు లేవనెత్తుతున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈ ప్రశ్నల జాబితా ఇంకా పెరిగేలా కనపడుతుందే తప్ప, దీనికి ఎండ్ కార్డ్ పడే సంకేతాలు అయితే కనపడడం లేదు.



