
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చెప్పట్టగానే మేమున్నాం అంటూ వెంటనే ఏపీ రాజకీయ వెండితెర మీద ప్రత్యక్షమవుతారు ఉండవల్లి అరుణ్ కుమార్, ముద్రగడ పద్మనాభం.
Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?
ఒకరు కుల పెద్దగా రాజకీయం మొదలు పెడితే మరొకరు రాష్ట్ర పెద్దగా రాజకీయం నడుపుతారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉండవల్లి గారు రాజకీయ ప్రవచనాలు వల్లెవేస్తుంటారు. అలాగే ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టేలా ముద్రగడ గారు కుల పోరాటాలకు పిలుపునిస్తారు.
అయితే అనూహ్యంగా ఈ ఇద్దరు కూడా కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమాలను నడుపుతుంటారు. వైసీపీ హయాంలో వీరికి రాష్ట్ర క్షేమం పట్టదు, కుల హక్కులు గుర్తురావు. అయితే గత ఐదేళ్లు జగన్ కు భజన చేస్తూ, వైసీపీ కి ఊడిగం చేస్తూ కుల పెద్ద అనే హోదాకు దూరమయ్యి అన్యాయానికి ‘కాపు’ కాసినందున ‘రెడ్డి’గా రూపాంతరం చెందారు ముద్రగడ.
Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్‌కి తొలి విగ్నం.. వాళ్ళేనా?
గత ఐదేళ్లు వైసీపీ కి వత్తాసు పలుకుతూ ఈయన గారు చేసిన రాజకీయ రచ్చకు సొంత కులం వారే కాదు సొంత కుటుంబ సభ్యులు కూడా ముద్రగడను తిరస్కరించారు. దీనితో రెడ్డిగారిగా మారిన ఈ పెద్దాయన ఇక ఎన్నటికీ తన సొంత సామజిక వర్గానికి కాపు కాయలేడు. వారి హక్కుల కోసం పోరాటాలకు పిలుపునివ్వలేరు.
దీనితో ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రిగా బాబు పాలన కొనసాగిస్తున్నప్పటికీ కాపు జాతికి రిజర్వేష్లలు కావాలండి, మా హక్కుల కోసం పోరాడతాం అండి అంటూ బహిరంగ లేఖలు రాయలేరు. ఉద్యమాలకు నాంది పలకలేరు. ఇక ఇక్కడితో ముద్రగడ పోరాటాలు మూగబోయినట్టే అనుకోవాలేమో.
Also Read – ట్రంప్-మోడీ భేటీ ఎవరిది పైచేయి?
వైస్ రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడిగా పేరుగడించిన ఉండవల్లి జగన్ కు అనుకూలంగా, వైసీపీకి సానుకూలంగా రాజకీయం చేయడంలో దిట్టగా నిరూపించుకున్నారు. అయితే ఇప్పుడు అదే జగన్ వైస్సార్ భార్య ను, వైస్సార్ కూతురుని కోర్టుకీడ్చారు, ఇదే వైసీపీ తల్లి, చెల్లి మీద నీచమైన విమర్శలు చేస్తూ వైస్సార్ విలువను దిగజారుస్తున్నారు, అయినా ఉండవల్లి నోరు మెదపలేని మౌనం పాటిస్తున్నారు.
గత ఐదేళ్ల జగన్ సోషల్ మీడియా ఉగ్రవాదం కళ్ళ ముందు కనిపిస్తున్నా, బాధితులు చట్ట సభలలో గోషిస్తున్నా ఉండవల్లి కళ్ళున్న గుడ్డివాడిలా మిన్నకుండిపోయారు. దీనితో ఇకపై ఉండవల్లి గారు గతం మాదిరి మీడియా ముందుకొచ్చి జగన్ కు మద్దతుగా, వైసీపీకి అనుకూలంగా రాజకీయ ప్రవచనాలు వల్లెవేయలేరు.
జగన్ ను నమ్మి కుల పెద్దగా చలామణి అయిన ఒకరు చివరికి కుల ద్రోహిగా మారితే, ఐదేళ్ల దుర్మార్గాన్ని వేలెత్తి చూపలేని ఉండవల్లి ఉసరవల్లిగా రూపాంతరం చెందారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పోరాటాలకు, ఉండవల్లి ప్రవచనాలకు రాష్ట్రంలో ఎటువంటి విలువ లేకుండా పోయింది.