బాబూ హరీష్! మావాడ్ని ముంచకు!

Ustaad Bhagat Singh Dubbing Begins, Fans Get Excited

పవన్ కళ్యాణ్‌- హరీష్ శంకర్‌ కాంబినేషన్‌ సుమారు ఏడాదిన్నార క్రితం మొదలుపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. నేటి నుంచి హైదరాబాద్‌ ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. త్వరలో పవన్ కళ్యాణ్‌ కూడా పాల్గొని తన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పబోతున్నారు.

పవన్ కళ్యాణ్‌ ఏపీ రాజకీయాలలో బిజీ అయ్యే ముందు మొదలుపెట్టిన సినిమాలలో ఇదీ ఒకటి. మిగిలినవన్నీ రిలీజ్ అయిపోయాయి. ఇదొక్కటే మిగిలింది. హరిహర వీరమల్లు, ఓజీకి సీక్వెల్ చేస్తానని పవన్ కళ్యాణ్‌ చెప్పినప్పటికీ వాటిని ఇప్పట్లో మొదలుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు.

ADVERTISEMENT

కనుకప్రస్తుతానికి ఇదే పవన్ కళ్యాణ్‌ చివరి సినిమా అనుకోవచ్చు. కనుక ఈ సినిమాపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్‌లది సూపర్ హిట్ కాంబినేషన్‌. కనుక దీనిపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి.

కానీ ఓ సినిమా షూటింగ్ ఏ కారణంతో ఎక్కువ కాలం సాగినా మద్యలో ఏవేవో మార్పులు చేర్పులు జరిగిపోతుంటాయి. చివరికి బోర్లా పడుతుంటుంది. రాజాసాబ్ ఇందుకు చక్కటి ఉదాహరణ.

కనుక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా అవసరం లేనివన్నీ జోడించి ఉంటే ఇప్పుడే నిర్దాక్షిణ్యంగా కత్తిరించి తీసేయడం మేలు. లేకుంటే ఇది కూడా బోర్లాపడే ప్రమాదం ఉంటుంది. లేకుంటే ఆనక బాధపడి ప్రయోజనం ఉండదు.

ADVERTISEMENT
Latest Stories