ఈ ‘రాధ ప్రేమకధ’ ఏ హీరోది?

Prabhas Radha Prema Kathaకొన్ని కొన్ని టైటిల్స్ వినగానే హీరో ఎవరన్న ఆసక్తి కలగడం సహజమే. అలాంటి ఓ టైటిల్ గురించే ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో పలు ఆసక్తికర కధనాలు వినపడుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్నేహితుల ప్రొడక్షన్ సంస్థ అయిన యువీ క్రియేషన్స్ తాజాగా “రాధ ప్రేమకధ” అనే టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించింది. ‘బాహుబలి’ ముగిసిన తర్వాత ప్రభాస్ ఈ సంస్థలో ఓ చిత్రం చేయనుండడంతో ఈ టైటిల్ ఎవరి కోసమా? అన్న ఆసక్తి నెలకొంది.

టైటిల్ చూస్తేనేమో సాఫ్ట్ గా, సైలెంట్ గా ఉండడంతో ప్రభాస్ రేంజ్ టైటిల్ కాదని అభిమాన వర్గాలు అంటుంటే, ‘బాహుబలి’ వంటి సినిమా తర్వాత సరిగ్గా ఇలాంటి సినిమాతోనే ప్రభాస్ రావాలని, తనపై ఉన్న అంచనాలను తగ్గించుకునేందుకు ఒక సాఫ్ట్ సినిమా చేయాలని, అందులో భాగంగానే ప్రభాస్ ఈ సినిమాను ఎంపిక చేసుకున్నారన్న టాక్ వినపడుతోంది. ఇలా “రాధ ప్రేమకధ” టైటిల్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఒకవేళ యంగ్ రెబల్ స్టార్ కాకపోతే, యువీ క్రియేషన్స్ లో నటించబోయే ఇతర హీరో ఎవరు? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories