మోడీ ప్రసంగం కోసం వాజ్‌పేయీ మృతి ప్రకటన ఆలస్యం చేశారా?

Vajpayee death announced late to avoid disrupting Narendra Modi Independence-Day speechమాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ మరణించిన తేదీ గురించి శివసేన సీనియర్‌ నాయకుడు సంజయ్‌ రావుత్‌ సందేహం వ్యక్తం చేశారు. ఆగస్టు 16న వాజ్‌పేయీ కన్నుమూసిన సంగతి తెలిసింది. అంతకుముందు కొన్ని రోజుల నుంచీ.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని డాక్టర్లు చెబుతూ వచ్చారు. .

[m9ad]

ADVERTISEMENT

చివరి రోజులలో కేంద్ర మంత్రులు ఆయనను చూడటానికి ఎయిమ్స్ కు క్యూ కట్టారు అయినా ఎవరు దాని గురించి మీడియాతో మాట్లాడేవారు కాదు. అయితే వాజ్‌పేయీ ముందుగానే మరణించినా.. ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఆ విషయాన్ని ఆలస్యంగా ప్రకటించారా అని ఆయన సందేహం వ్యక్తంచేశారు.

“ఆగస్టు 12నుంచే వాజ్‌పేయీ ఆరోగ్యం క్షీణిస్తూవచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ సంతాపం, పతాక అవనతాలను తప్పించేందుకు.. ఆగస్టు 16న వాజ్‌పేయీ మరణించినట్లు ప్రకటించారా? పైగా అప్పుడు ఎర్రకోట నుంచి మోదీ సుదీర్ఘ ప్రసంగం చేయాల్సి ఉంది’’ అని సంజయ్‌ రాసుకొచ్చారు.బహుశా ఇది నిజమైన సరే ఆ సత్యం ఎప్పటికీ బయటకు రాకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories