
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుని పిటిషనర్ సత్య వర్ధన్ చేత వెనక్కు తీసుకునేలా చేసి చాలా తెలివిగా వ్యవహరించామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అదే కేసులో చిక్కుకొని జైలు పాలవడం ఖర్మ ఫలమనే అనుకోక తప్పదు.
సత్య వర్ధన్‌ని వంశీ, అనుచరులు కిడ్నాప్ చేసి హైదరాబాద్‌లో వంశీ ఇంటికి తీసుకువెళ్ళిన్నట్లు పోలీసులు బలమైన సాక్ష్యాధారాలు సేకరించారు. కనుక ఓ కేసు నుంచి బయటపడితే అంత కంటే తీవ్రమైన కేసులో అరెస్ట్ అవుతానని గ్రహించని వంశీకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.
Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!
అయితే ముందే చెప్పుకున్నట్లు ఈ కేసు కూడా ఏదోరోజు బెయిలుతోనే ముగియవచ్చు. ఆ ప్రక్రియలో మొదటి మెట్టుగా ముందస్తు బెయిల్ కోరడం. న్యాయస్థానం దానిని తిరస్కరించింది.
జైల్లో ఉన్నారు కనుక మళ్ళీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆయన బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి మరో మూడు సమయం కావాలని పోలీసులు కోరడమే కాక ఆయనని ప్రశ్నించేందుకు పది రోజులు కస్టడీ కావాలని కోర్టుని అభ్యర్ధించారు.
Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..
పోలీస్ కస్టడీ.. విచారణ అంటే ఎలా ఉంటుందో రఘురామ కృష్ణరాజు చెప్పేశారు కనుక రాంగోపాల్ వర్మ మొదలు వల్లభనేని వంశీ వరకు అందరూ భయపడుతున్నారు. తమకు అలాంటి ట్రీట్‌మెంటే లభిస్తుందని గజగజలాడుతున్నారు.
కనుక కస్టడీలోకి వెళ్ళకుండా బెయిల్ సంపాదించుకొని బయటపడాలని వల్లభనేని వంశీ ఆతృతగా ఉన్నారు. కానీ జగన్ చెప్పే దేవుడి స్క్రిప్ట్ వల్లభనేని వంశీకి వర్తిస్తుండటం విశేషం.
Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?
ఒకవేళ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యుంటే బెయిల్ లభించి ఉండేదేమో?కానీ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారు! కనుక పోలీసుల కస్టడీకి వెళ్ళకుండా వల్లభనేని వంశీ బయటపడలేకపోవచ్చు.
కనుక విచారణలో వంశీకి ఎలాంటి ట్రీట్‌మెంట్ లభిస్తుందనేది ఈ కేసులో ఓ కీలక ఘట్టం. ఆ తర్వాత మిగిలిన న్యాయ ప్రక్రియ అంతా జస్ట్ రొటీన్!