‘చెప్పను బ్రదర్’ తర్వాత… ‘అరవడం ఆపకపోతే ఇరగ్గొడతాను’

vangaveeti-audio-launch-ram-gopal-varma-dialogueదర్శకుడు వర్మ… సినీ ఇండస్ట్రీలో ఏదైనా చేయగల మొనగాడు… రాయలసీయ రక్తచరిత్రను తెరకెక్కించే ధైర్యం చేయలన్నా… విజయవాడ రౌడీ చరిత్రను సాక్షాత్కరింప చేయలన్నా… అది ఒక్క వర్మకే సాధ్యం. అలాంటి వర్మ “వంగవీటి” ఆడియో వేడుకలో ప్రసంగిస్తున్న సందర్భంలో… అభిమానుల నుండి ఓ డిమాండ్ వినపడింది. ఏ ప్రముఖ వ్యక్తి మాట్లాడినా… సహజంగా ఓ ‘డైలాగ్’ను అడగడం సినీ ప్రేక్షకులకు పరిపాటే.

మరి దానికి ఎలాంటి సమాధానం ఇచ్చుంటారు. బహుశా వేరే ఎవరైనా అయితే ఏదొక డైలాగ్ చెప్పి అభిమానులను అలరించడమో లేక వెండితెరపై చూస్తేనే ఆ కిక్ ఉంటుందని తప్పించుకోవడమో చేస్తుంటారు. అయితే అందులో వర్మ స్టైల్ ఏముంటుంది… అందుకే “అరవడం ఆపకపోతే ఇరగ్గొడతాను” అంటూ ఓ విధమైన వార్నింగ్ తో కూడిన డైలాగ్ ను సదరు అభిమానులకు చెప్పి ‘నోళ్ళు’ మూయించారు. ఇది కూడా వర్మకే సాధ్యం అని చెప్పకతప్పదు.

ADVERTISEMENT

అప్పుడెప్పుడో ‘సరైనోడు’ సక్సెస్ వేడుకలో పవన్ గురించి అడిగితే… ‘చెప్పను బ్రదర్’ అన్న తర్వాత, ఇప్పుడు ‘వంగవీటి’ ఆడియో వేడుకలో ‘అరవడం ఆపకపోతే ఇరగ్గొడతాను’ అనే డైలాగ్ హైలైట్ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో ఈ డైలాగ్ తో ట్యాగ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇంకొక విశేషం ఏమిటంటే… ఈ వేడుకపైన వర్మ ‘వంగవీటి’ టైటిల్ సాంగ్ ఆలపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories