ట్రైలర్ టాక్ – ‘కన్ఫ్యూషన్’ పోయి ‘క్లారిటీ’ వచ్చింది!

vangaveeti-trailer-talk-rgv-confusion-clarityమరో రెండు రోజుల్లో ధియేటర్లలో ప్రత్యక్షం కానున్న ఆర్జీవీ “వంగవీటి” సినిమాకు సంబంధించి తాజాగా ఓ ట్రైలర్ ను విడుదల చేసారు. గతంలో విడుదల చేసిన ట్రైలర్ తో పోలిస్తే… చాలా బెటర్ అనిపించే విధంగా ఈ ట్రైలర్ ఉండడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ‘వంగవీటి’ సినిమాలో చాలా క్యారెక్టర్లు ఉండడంతో, ఏ క్యారెక్టర్ ఎవరు పోషించారో తెలియనంత ‘కన్ఫ్యూషన్’లో గత ట్రైలర్ ఉంది. అయితే తాజా ట్రైలర్ లో మాత్రం క్యారెక్టర్స్ ను పక్కనపెట్టి, ఏమోషన్స్ ను హైలైట్ చేస్తూ ‘క్లారిటీ’గా ట్రైలర్ ను కట్ చేసారు.

యధావిధిగా వర్మ మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ అదరగొట్టాడు. ప్రతి క్యారెక్టర్లోనూ ‘ఇంటెన్సిటీ’ని చూపించిన వర్మ, అలనాటి విజయవాడ రౌడీచరిత్రను వెండితెరపై ప్రతిబింభించే ప్రయత్నం చేసారు. విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ‘వంగవీటి’పై అంచనాలు పెంచే విధంగా చిత్ర ప్రమోషన్స్ జరుగుతున్నాయి. చూడబోతుంటే… తన డ్రీం ప్రాజెక్ట్ కోసం వర్మ బాగానే కష్టపడినట్లున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఈ సినిమాతో రాజమౌళి అన్నట్లు… ‘ఆర్జీవీ ఈజ్ బ్యాక్’ అనిపిస్తారా..? ఈ ట్రైలర్ అయితే కాస్తంత నమ్మకాన్ని పెంచింది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories