గజ్వెల్ లో కేసీఆర్ గెలుపు అంత తేలిక కాదని హరీష్ రావు ఒప్పుకున్నట్టేనా?

Harish Rao To Sacrifice for KCR?ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సొంత నియోజకవర్గమైన గజ్వెల్ లో హోరాహోరీ పోరు జరుగుతుంది. మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల కేసీఆర్ మీద ప్రతాప్ రెడ్డికి కలిసి వస్తుంది. ఒకవేళ కేసీఆర్ గెలిచినా ముక్కిమూలిగి మాత్రమే బయటపడుతారని కొందరి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

[m9ad]

ADVERTISEMENT

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గజ్వేల్‌లో ఓడించాలని మంత్రి హరీశ్‌రావు తనకు ఫోన్‌ చేసి కోరారని ఆయన సంచలన వాఖ్యలు చేశారు. తెరాసలో తనను ఎదగనీయకుండా కుమారుడు కేటీఆర్‌ను కేసీఆర్‌ ప్రోత్సహిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఆవేదన చెందారన్నారు. తనకున్న ఫాలోయింగ్‌తో గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించాలని, ఇందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేెస్తానని చెప్పారన్నారు.

కేసీఆర్‌ ఉన్నంత కాలం రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన ఆవేదన చెందారని వంటేరు తెలిపారు. అయితే వంటేరు ప్రకటనపై కేసీఆర్ మండిపడ్డారు. మూడోసారి ఓడిపోతున్నానని తెలిసి, మానసిక స్థితి తప్పి కాంగ్రెస్‌ నేత ప్రతాప్‌రెడ్డి తనపై పిచ్చి ఆరోపణలు చేశారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆధారాలు చూపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అయితే ఇదే సమయంలో గోబెల్స్‌ ప్రచారం చేస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతాననుకుంటున్నాడేమో..ఇక నుంచి ఇక్కడే ఉంటా.. ఎన్నికలయ్యే వరకు ఉండి వంటేరు సంగతి తేల్చి రాజకీయంగా సమాధి చేశాకే గజ్వేల్‌ నుంచి వెళ్తానని చెప్పారు. అయితే రెండు సార్లు ఓడిపోయిన ఒక అభ్యర్థిని అది కూడా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఓడించడానికి హరీష్ రావు వంటి సీనియర్ మంత్రి తిష్ట వెయ్యాల్సి వచ్చిందంటే గజ్వెల్ లో కేసీఆర్ గెలుపు అంత తేలిక కాదని హరీష్ రావు ఒప్పుకున్నట్టేనా?

ADVERTISEMENT
Latest Stories