ట్రైలర్ టాక్ – చూస్తే ఎవ్వడైనా ఫిదా అవ్వాల్సిందే!

Vara Trailer,Vara Trailer Telugu Short Film,Vara Short Film Trailer Talk,Vara Trailer Short Film Review,Vara Trailer Short Film Release,Vara Short Film Talkనవతరం ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్. ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ వరకు ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ కు నెటిజన్లు బ్రహ్మరధం పడుతున్నారు. బహుశా పెద్ద హీరోల సినిమాల ట్రైలర్లు కూడా ఈ స్థాయిలో ఉన్నాయో లేవో అనేటంతగా ఈ “వర” షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

‘బిగ్గెస్ట్ సీక్రెట్ ఆఫ్ యూనివర్స్’ అంటూ సాగిన ట్రైలర్లో పెన్సిల్ గాల్లోకి లెగడంతో వీక్షకుల ఆసక్తి మరింతగా పెరిగిపోయింది. దానికి అనుగుణంగా వచ్చే బ్యాక్ గ్రౌండ్ సంగీతం అద్భుతంగా ఉంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్, ఫోటోగ్రఫీలు ఏ మాత్రం ఓ భారీ సినిమాకు తగ్గని రీతిలో ఉన్నాయి. కాగిత విద్యాధర్ దర్శకత్వం వహించిన ఈ ట్రైలర్లో మేకా రామకృష్ణ, వినోద్ వర్మ ప్రధాన తారాగణంలో నటించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్న “వర” సినిమా ట్రైలర్ పై సర్వత్రా పాజిటివ్ కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories