మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసీపి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ని జగన్మోహన్ రెడ్డి వేరే చోటికి పంపించి అక్కడి నుంచి ప్రముఖ సినీ హాస్యనటుడు అలీకి అవకాశం ఇస్తారని వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే వెల్లంపల్లి, ఆయన అనుచరులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాడేపల్లి నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.
ఈ వార్తలపై వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ, “మీడియాలో వస్తున్నవన్నీ ఊహాగానాలే తప్ప వాస్తవం కావు. మా అధినేత నన్ను విజయవాడ సెంట్రల్‌కి వెళ్ళమన్నారని లేకుంటే పక్కన పెడతానన్నారని వస్తున్న వార్తలు అబద్దం. అలాగే నేను పార్టీకి రాజీనామా చేయబోతున్నాననే వార్తలు అబద్దమే.
రాబోయే ఎన్నికలలో కూడా విజయవాడ పశ్చిమ నుంచి మళ్ళీ నేనే పోటీ చేయబోతున్నాను. జగన్ నన్ను పక్కన పెట్టడానికి కారణం ఏమీ లేదు,” అని అన్నారు.
అయితే తాడేపల్లి ప్యాలస్ నుంచి ఎప్పుడు ఎవరికి పిలుపు వసుందో… ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో వైసీపిలో ఎవరికీ తెలీదు. కనుక పిలుపు రానంతవరకు ఇలా ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు. పిలుపు వచ్చి సీటు పోయాక తలుపులు వేసుకొని ఎలాగూ ఏడ్వక తప్పదు.




