వెంకయ్యది చంద్రబాబును కాపాడే ప్రయత్నమా? బీజేపీని కాపాడే ప్రయత్నమా?

Chandrababu Naidu - Venkaiah Naiduఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు తమాషాగా సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై స్వయంగా ఉప రాస్ట్రపతి వెంకయ్య నాయుడు సమీక్ష చేసారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి , ఎపి బిజెపి మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అయితే భాజపాలో టీడీపీ వ్యతిరేక వర్గంగా భావించే సోము వీర్రాజుగానీ, పురందేశ్వరిగానీ, కన్నా లక్ష్మి నారాయణగానీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఢిల్లీలో ఒకపక్క ఆ మీటింగ్ జరుగుతుండగానే సోము వీర్రాజు మరో ప్రెస్ మీట్ పెట్టి టిడిపి పై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలుగుదేశంపార్టీ చేయాల్సింది రూలింగ్ కాని, ట్రేడింగ్ కాదని సెటైర్ వేశారు.

ADVERTISEMENT

మిత్రపక్షమైన టీడీపీ ఒక మాట అంటేనే మిత్రధర్మం గురించి లెక్చర్ ఇచ్చే వీర్రాజు మాత్రం ఏకధాటిగా రెచ్చిపోయారు. టీడీపీ నాయకులకు చంద్రబాబు లక్ష్మణ రేఖ గీయడంతో ఆయనకు అడ్డు ఆపు లేదనే చెప్పాలి. తమ పార్టీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కనీస గౌరవం ఇవ్వటంలేదని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్ట్‌ ఆవశ్యకతను గుర్తించామని.. అన్ని విధాలా కేంద్రం నుంచి సాయం ఉంటుందని గడ్కరి తమకు హామీ ఇచ్చారని బీజేపీ అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. 2019లోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పారని ఎంపీ వివరించారు. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న రెండు పరస్పర వ్యతిరేక పరిణామాలు విశ్లేషకులని సైతం విస్తుగొలుపుతుంది.

ఈ రొంపిలోకి సాక్షాత్తు ఉపరాష్ట్రపతి ఎందుకు రావాల్సి వచ్చిందంటే కూడా బీజేపీలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. తన ఆప్తుడైన చంద్రబాబుని కాపాడటానికి అని ఒక వర్గం. టీడీపీతో దోస్తీ లేకపోతే పార్టీకి నష్ట్రం కాబట్టి కమలం కోసమే ఆయన ఎంటర్ అయ్యారని ఇంకొందరు చెబుతున్నారు. ఇక్కడ కూడా వైరుధ్యమే

ADVERTISEMENT
Latest Stories