సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన “గురు” టీజర్ అంచనాలను మించి ఉంది. విక్టరీ వెంకటేష్, రితిక సింగ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా హిందీ ‘సాలా ఖడూస్’కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న సందేహానికి ఈ టీజర్ స్పష్టమైన సందేశం ఇచ్చినట్లుగా కనపడుతోంది.
ముఖ్యంగా టీజర్ లో వెంకీ చెప్పిన డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ అదిరిపోయే రీతిలో కనపడుతున్నాయి. ‘పాపం ఆడపిల్లలు… కొంచెం సున్నితంగా చెప్పండి’ అని నాజర్ చెప్పిన డైలాగ్ కు ‘అలా చెప్తే వాళ్ళు కూడా నీలాగా మరుగుదొడ్లు కడుక్కుంటూ చస్తారు’ అంటూ వెంకీ చెప్పిన డైలాగ్ ఈ సినిమా ‘థీమ్’ను చెప్పకనే చెప్తోంది. మొత్తంగా ‘గురు’ సినిమా కూడా ఓ పర్ ఫెక్ట్ రీమేక్ గా సిద్ధమవుతున్నట్లు కనపడుతోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



