సీజేపీ జాతకం చెప్పిన వేణు…

Venu Swamy Cockroach Janata Party Prediction

రాష్ట్రం నుంచి దేశం వరకు హాట్ టాపిక్స్ గా మారిన ప్రతి అంశంలోనూ తన జాతక చక్రంతో రంగ ప్రవేశం చేయడం వేణు స్వామి స్పెషల్. సినీ సెలబ్రెటీల సినీ ప్రస్థానం నుంచి వారి వైవాహిక జీవితాల వరకు వేణు స్వామి చేసే ప్రకటనలు ఎప్పుడు వివాదాస్పదంగానే మారతాయి.

అలాగే రాజకీయ పార్టీల భవితవ్యం నుంచి పార్టీ అధినేతల రాజకీయ భవిష్యత్ వరకు వేణు తన దివ్య దృష్టిని ఉపయోగించి కాలచక్రాన్ని ముందే ఉహించగలరు. అయితే అవి వేణు చెప్పిన విధంగా కాకుండా మరోరకమైన ఫలితాలు ఇచ్చినా వేణు మాత్రం ఈ జాతకాల రొచ్చు నుండి బయటకు రాలేకపోతున్నారు.

ADVERTISEMENT

2024 ఏపీ ఎన్నికలలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని, తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలోకి రావడం, బిఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ పట్టాభిషేకం తధ్యం అని ప్రకటించి చివరికి ఫలితాలు చూసి కాస్త వెనక్కి తగ్గారు.

ఇక ఇప్పుడు భారతదేశాన్ని తన ఉద్యమంతో కుదిపేస్తున్న సీజేపీ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటూ సీజేపీ జాతక చక్రాన్ని వివరించేందుకు వేణు స్వామి సిద్ధమయ్యారు. రానున్న భారతదేశ రాజకీయాలలో సీజేపీ చాల కీలక పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వాన్ని నిర్దేశించే స్థాయికి సీజేపీ రాజకీయ ఎదుగుదల చేరుతుందంటూ వేణు కాక్రోచ్ పార్టీ జాతకాన్ని వివరించేసారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉందని, సీజేపీ పార్టీకి సంబందించిన ముగ్గురు కీలక నాయకులు భవిష్యత్ లో జైలుకు వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయని, కాక్రోచ్ పార్టీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్లే ప్రయత్నం చేస్తుందని, సీజేపీ పార్టీతో బీజేపీ కచ్చితంగా రాజకీయంగా ఎదురుదెబ్బలు తినే ఛాన్స్ 100 కి 90% ఉందంటూ వేణు సీజేపీ కి అనుకూల గ్రహాలు ఉన్నట్టు ప్రకటించారు.

మరి ఈ సరైన వేణు స్వామి జాతక చక్రం ఫలిస్తుందా.? వేణు ఉహించినట్టుగా రానున్న కాలంలో బీజేపీ అధికారానికి సీజేపీ చెక్ పెట్టనుందా అనేది వేచి చూడాలి..!

ADVERTISEMENT
Latest Stories