బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ వివాహం గురించి మాట్లాడుతూ… పునరుత్పత్తి కోసమే వివాహమని, అదే భారతీయ సంస్కృతి అని పేర్కొంది. సాన్నిహిత్యంలోనే ఆనందం ఉందని, సెక్స్ అనేది ఓ భావన మాత్రమేనని, అది చర్యకాదనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానని పేర్కొంది. ఇంత పెద్ద భారతదేశంలో ఇప్పటికీ సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడడానికి సిగ్గుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.
ADVERTISEMENT
‘‘వివాహం ద్వారానే లైంగిక వాంఛలు తీర్చుకోవాలని భారతీయ సంస్కృతి చెబుతోంది. దీని ఉద్దేశం పునరుత్పత్తే. అయితే ‘సాన్నిహిత్యం’లోని ఆనందాన్ని చాలామంది కోల్పోతున్నారు’’ అని వివరించింది. ‘కృపయా ధ్యాన్ దే’ సిరీస్ కోసం ‘టాబూ’ పేరుతో ఓ వీడియోను చిత్రీకరించిన సందర్భంగా విద్యాబాలన్ ఈ వ్యాఖ్యలు చేసింది.
ADVERTISEMENT



