అంతకు ముందు రెండు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క ‘బిచ్చగాడు’ సినిమాతో ఫుల్ పాపులారిటీ రావడంతో, విజయ్ అంటోనీ చిత్రాలు తెలుగు మార్కెట్ పై కూడా ఫోకస్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే విజయ్ నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘సైతాన్’ను తెలుగులో ‘భేతాళుడు’గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తమిళ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ ట్రైలర్ లో ఉన్న విశిష్టత ఏమిటంటే… ప్రతి ఒక్కరు సీరియస్ రోల్ ను పోషిస్తున్నట్లుగా అన్ని పాత్రలు ఒకే విధంగా చూస్తున్నాయి. విజయ్ అంటోనీ డిఫరెంట్ గెటప్స్ తో మరోసారి ప్రయోగానికి తెరలేపినట్లుగా కనపడుతుండగా, ఆసక్తికరంగా సాగిన ట్రైలర్ లో ఫోటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ సంగీతం ప్రధాన ప్లస్ పాయింట్స్ గా మారాయి. విజయ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. చూడబోతుంటే… ఈ ‘సైతాన్’ తెలుగులో కూడా బాగానే కొట్టేటట్లు ఉన్నాడు.



