ఇది విజయ్ దేవరకొండ “మనసు చెప్పింది”

Vijay Deverakond cancels shootingసూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల, బుధవారం నాడు ‘ఫాలో యువర్ హార్ట్’, ‘మంజులా అఫీషియల్’ ట్యాగ్ లైన్స్ యాడ్ చేస్తూ, ‘మనసుకు నచ్చింది’ అనే పేరుతో తన జీవితంపై ఓ షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది చూసిన వారంతా మంజులలో దాగున్న ప్రతిభకు ఫిదా అవుతూ, ప్రశంసలు కురిపిస్తున్న వేళ, నటుడు విజయ్ దేవరకొండ మరో అడుగు ముందుకేసి, ఆమెను ఫాలో అయిపోయాడు.

తన మనసు చెప్పిందని చెబుతూ, షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించాడు. “షూటింగ్ క్యాన్సిల్. నిద్ర పోవాలని నా మనసు చెప్పింది” అని వ్యాఖ్యానించాడు. మంచం ఎక్కేసి దుప్పటి కప్పుకున్న ఓ చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ఉంచాడు. అదిప్పుడు వైరల్ అయింది. విజయ్ పోస్టు చేసిన ఆ చిత్రం పై మీరూ ఓ లుక్కేయండి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories