చంద్రబాబుని తిట్టడానికి అలా కావాలంటే అలా ఇలా కావాలంటే ఇలా

Vijay Sai Reddy fires on chandrababu Naiduచంద్రబాబును తిట్టాలంటే విజయసాయి రెడ్డి అవసరమైతే ఆయనను సురేష్ అని తిడతారు కావాలంటే రమేష్ అనీ తిడతారు. సురేషా రామేషా అంటే ఆయన చంద్రబాబును తిట్టడానికి ఎలా బావుంటే అలా వాడతారు. ఇప్పుడు తాజాగా ఏపీ హైకోర్టు భవనాల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని, హైదరాబాద్‌ను తానే నిర్మించానంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా హైకోర్టు భవనం నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు.

[m9ad]

ADVERTISEMENT

అదే విధంగా హైకోర్టును హైదరాబాద్‌ నుంచి అమరావతికి తీసుకురావడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు విజయసాయి రెడ్డి, వైకాపా వారు హైదరాబాద్ మీద మనకు 10 సంవత్సరాలు హక్కు ఉన్నా ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు అమరావతికి వచ్చి దుబారా చేస్తున్నారని ఆరోపించే వారు. ఇప్పుడేమో హైకోర్టును హైదరాబాద్‌ నుంచి అమరావతికి తీసుకురావడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆరోపణలు చేస్తున్నారు.

ఇప్పటి మాటనే తీసుకుంటే నాలుగున్నర ఏళ్ళ పాటు జగన్ గానీ విజయసాయి రెడ్డి గానీ ఏపీకి సందర్శకులే కదా. నాలుగున్నర ఏళ్ళలో వారిద్దరూ కనీసం ఇక్కడ ఒక్క అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఏర్పాటు చేసుకోలేకపోయారు. అయితే అవసరాన్ని బట్టి అమరావతికి రావాలని ఒకసారి, ఎందుకు వచ్చాం అని ఇంకోసారి విమర్శలు చేస్తూ ఉంటారు. మరో వైపు ఉమ్మడి హైకోర్టు విభజనను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

ఇప్పటికే రెండు హైకోర్టులకు సంబంధించి వేర్వేరుగా ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తైన నేపథ్యంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. విభజనకు ముందే పిటిషన్ వేసినా కోర్టు చాకచక్యంగా తొలుత అత్యవసర విచారణ చేపట్టాలన్న అభ్యర్థనను తిరస్కరించి ఇప్పుడు ప్రమాణ స్వీకారాలు పూర్తి అయిపోయాయి కాబట్టి ఏమీ చెయ్యలేము అని తేల్చేసింది. దీనితో ఉమ్మడి హై కోర్టు విభజన జరగాలని కోర్టు కోరుకున్నట్టుగా అర్ధం అవుతుంది. దీనితో ఉమ్మడి హై కోర్టు అనేది ఇక చరిత్ర.

ADVERTISEMENT
Latest Stories