చంద్రబాబుకు పిచ్చి.. పిచ్చాసుపత్రిలో చేర్పించాలి: విజయసాయిరెడ్డి

Vijaya Sai Reddy -వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్రతో చంద్రబాబుకు మతిభ్రమించిందన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులను పిచ్చాస్పత్రుల్లో చేర్పించాలని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT

అధికారంలోకి వస్తే వైఎస్ లాంటి పరిపాలన జగన్ అందిస్తారని అన్నారు. ప్రజల కోసం జగన్ నవరత్నాలు తీసుకొస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మాత్రం ఒక రత్నం తెచ్చారని..అదే ఆయన పుత్రరత్నం అని ఎద్దేవా చేశారు. టీడీపీ సైకిల్‌కి బీజేపీ, జనసేన రెండు చక్రాలని..ఇప్పుడు ఊడిపోయాయని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే విజయసాయిరెడ్డి పలుసార్లు చంద్రబాబుపై పరుష వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే పెద్ద ఎత్తున దుమారం లేచింది. విశ్లేషకులు నంధ్యాలలో వైకాపా ఓడిపోవడానికి ఆ వ్యాఖ్యలు కూడా కారణం అని చెప్పారు అయితే వైకాపా వారికి ఇంకా ఆ విషయం అర్ధమైనట్టు లేదు.

ADVERTISEMENT
Latest Stories